
Donald Trump: 'భారత్ సుంకాలతో చంపుతోంది': ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించడం వల్ల తమ దేశం నష్టపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. "చైనా సుంకాలతో మమ్మల్ని దెబ్బతీస్తోంది. భారత్ కూడా టారిఫ్‌లతో మాకు గట్టి దెబ్బ కొడుతోంది. బ్రెజిల్ కూడా అధికంగా సుంకాలు విధిస్తోంది" అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. స్కాట్ జెన్నింగ్స్ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ, టారిఫ్‌ల గురించి తనకున్న అవగాహన మరెవరికీ లేదని ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌పై 50 శాతం వరకు టారిఫ్ విధించడం సరైన నిర్ణయమేనని ఆయన సమర్థించుకున్నారు. తమ దేశ వస్తువులపై ఆయా దేశాలు అత్యధిక టారిఫ్ విధిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
వివరాలు
అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని ఆరోపణ
అమెరికా వస్తువులపై ఇకపై ఎటువంటి సుంకాలు ఉండవని ఢిల్లీ హామీ ఇచ్చిందని కూడా ఆయన వెల్లడించారు. తన చర్యల ఫలితంగా అనేక దేశాలు టారిఫ్‌లను తగ్గించేందుకు సిద్దమవుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని ఆయన ఆరోపిస్తూ, తాను చర్యలు తీసుకోకపోతే ఆ పరిస్థితి మారేదే కాదని స్పష్టం చేశారు. అందుకే సుంకాలు తప్పనిసరి అని, దాంతో అమెరికా ఆర్థికంగా మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, వివిధ దేశాలపై విధించిన అమెరికా టారిఫ్‌లు చట్టవిరుద్ధమని ఒక ఫెడరల్ అప్పీల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా ట్రంప్ స్పందించారు. ఈ కేసుల వెనుక ఇతర దేశాల ప్రోత్సాహం ఉందని ఆయన ఆరోపించారు.