Page Loader
India vs America: అమెరికా 10% సుంకాన్ని ఉపసంహరించకపోతే ప్రతీకార చర్యలు తప్పవు : భారత్
అమెరికా 10% సుంకాన్ని ఉపసంహరించకపోతే ప్రతీకార చర్యలు తప్పవు : భారత్

India vs America: అమెరికా 10% సుంకాన్ని ఉపసంహరించకపోతే ప్రతీకార చర్యలు తప్పవు : భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన కీలక ప్రకటనతో ప్రపంచ వాణిజ్యంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ట్రంప్ ప్రకారం, అన్ని దేశాల దిగుమతులపై 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ విధించనున్నట్లు ఏప్రిల్ 2న తెలిపారు. ఈ విధానాన్ని జూలై 9వ తేదీ నుంచి అమల్లోకి తేవాలని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. జూన్ 4న అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం న్యూఢిల్లీకి చేరుకుంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే నాలుగు రౌండ్ల చర్చలు జరిగాయి. తాజాగా ఐదో రౌండ్ చర్చలు ముఖాముఖిగా నిర్వహించబడ్డాయి.

Details

అమెరికా బృందంతో మరోసారి సమావేశం

ఈ చర్చల్లో భారతదేశం కీలక డిమాండ్లను అమెరికా ముందు ఉంచింది. కొత్తగా విధించిన 10 శాతం బేస్‌లైన్ సుంకాన్ని పూర్తిగా తొలగించడమే కాకుండా, జూలై 9నుంచి అమలు చేయనున్న 16 శాతం అదనపు సుంకాన్ని కూడా నిలిపేయాలని భారత్ స్పష్టంగా పేర్కొంది. ఈ రెండు సుంకాలు అమల్లోకి వస్తే, భారత్ కూడా అమెరికా దిగుమతులపై ప్రతీకార టారిఫ్‌లను కొనసాగించే హక్కును వదులుకోదని తెలిపింది. ఇక జూన్ 10న కూడా మరోసారి ఢిల్లీలో భారత వాణిజ్య ప్రతినిధులతో అమెరికా బృందం సమావేశం కానుంది. ఈ చర్చల నేపథ్యంలో, ఇరు దేశాల అధికారు మాటల వారితో స్పందించారు.

Details

వాణిజ్య ఒప్పందాలు సమతుల్యంగా ఉండాలి

అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో, వాణిజ్య ఒప్పందాలు సమతుల్యంగా ఉండాలని సూచించారు. భారత వాణిజ్య ప్రతినిధులు పేర్కొన్న దాని ప్రకారం — వాణిజ్యం పోటీతత్వం కాదు, పరస్పర అనుకూలతతో సాగాలి. అమెరికా తన విధానాల్లో కొంత తేలిక ఇచ్చినట్లయితే, యూఎస్ వస్తువులకు భారత మార్కెట్ మరింతగా తెరుచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.