
US: అమెరికాలో భారత టెకీ దారుణం.. భార్య, కుమారుడిని చంపి.. తాను ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ టెక్నాలజీ వ్యాపారవేత్త దారుణ చర్యకు పాల్పడ్డాడు.
ఆయన తన భార్యను, కుమారుడిని తుపాకీతో కాల్చి హత్య చేశాడు. అనంతరం తనకు తానుగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషాద సంఘటనతో మరో కుమారుడు అనాథగా మిగిలిపోయాడు. ఈ ఘటన ఏప్రిల్ 24న వాషింగ్టన్ రాష్ట్రంలోని న్యూక్యాజిల్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హర్షవర్ధన్ ఎస్. కిక్కెరీ (57), ఆయన భార్య శ్వేత పన్యం (44), అలాగే వారి 14 ఏళ్ల కుమారుడు ఈ దారుణ ఘటనలో మృతి చెందినవారు.
ఈ ఘటన జరిగిన సమయంలో హర్షవర్ధన్ మరొక కుమారుడు ఇంట్లో లేకపోవడంతో అతడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
వివరాలు
మైసూరు నగరంలో 'హోలోవరల్డ్' పేరుతో రోబోటిక్స్ సంస్థ
ఈ హత్యలు ఎందుకు జరిగాయన్న విషయమై ఇంకా స్పష్టత లేనని, కేసును విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.
దర్యాప్తు పూర్తయ్యే వరకు గోప్యత కోసం చిన్నారుల పేర్లు, ఫోటోలు బయటపెట్టడం లేదని స్పష్టం చేశారు.
హర్షవర్ధన్ ఎస్. కిక్కెరీ కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందినవారు.చాలా ఏళ్ల క్రితమే అమెరికాకు వెళ్లిన ఆయన,2017లో భార్య శ్వేతతో కలిసి భారత్‌కు తిరిగొచ్చారు.
అనంతరం మైసూరు నగరంలో 'హోలోవరల్డ్' అనే రోబోటిక్స్ సంస్థను స్థాపించారు.ఈ కంపెనీకి శ్వేత కూడా సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు.
కొద్ది కాలంలోనే ఈ సంస్థ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాదు,సరిహద్దు భద్రత కోసం రూపొందించిన రోబోల ప్రదర్శన సందర్భంగా అప్పటి ప్రధాని నరేంద్ర మోదీని కూడా వీరు కలిసి, తన సంస్థ కార్యాచరణ వివరించారు.
వివరాలు
మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన హర్షవర్ధన్
అయితే, కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో 2022లో కంపెనీని మూసివేసి, తిరిగి అమెరికా వెళ్లిపోయారు.
రోబోటిక్స్ రంగంలో నిపుణుడైన హర్షవర్ధన్ గతంలో అమెరికాలో ప్రముఖ సాంకేతిక సంస్థ మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు.