ఇజ్రాయెల్ దాడికి మద్ధతుగా యూఎన్ఓలో అమెరికా తీర్మానం.. వీటోతో వ్యతిరేకించిన రష్యా, చైనా
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడిలను ఆత్మరక్షణ చర్యగా పేర్కొన్న అమెరికా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UN SECURITY COUNCIL)లో ఈమేరకు ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనేే రష్యా, చైనా బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో తమ వీటో హక్కును ఉపయోగించాయి. అగ్రరాజ్యం అమెరికా తీర్మానానికి యూఏఈతో కలిసి వ్యతిరేకంగా ఓటేశాయి.మరోవైపు సదరు తీర్మానాన్ని అమెరికాతో పాటు యూకే బలపర్చాయి. యుఎస్ ముసాయిదా తీర్మానాన్ని గట్టిగా తిరస్కరిస్తున్నామని, ఇది తక్షణ కాల్పుల విరమణకు వీలు కల్పించదని చైనా ప్రతినిధి తెలిపారు. UNSCలోని 10 మంది సభ్య దేశాలు US, UK, ఫ్రాన్స్, జపాన్, స్విట్జర్లాండ్, అల్బేనియా, మాల్టా, గాబన్, ఘనా , ఈక్వెడార్ తీర్మానానికి ఓటు వేశారు. మొజాంబిక్, బ్రెజిల్ గైర్హాజరయ్యాయి.