Page Loader
చైనాలో దారుణం.. ఇజ్రాయెల్‌ దౌత్యవేత్తపై కత్తిపోట్లతో దాడి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు
చైనాలో దారుణం.. ఇజ్రాయెల్‌ దౌత్యవేత్తపై కత్తిపోట్లతో దాడి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు

చైనాలో దారుణం.. ఇజ్రాయెల్‌ దౌత్యవేత్తపై కత్తిపోట్లతో దాడి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 13, 2023
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో దారుణం చోటు చేసుకుంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ దౌత్యవేత్తపై తీవ్ర దాడి జరిగింది. రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్‌ దౌత్య సిబ్బందిని కత్తితో భయంకరంగా పొడిచారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దౌత్య ప్రతినిధి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. దాడికి కారణం ఎవరు, ఏమిటి అన్న విషయాలు ఇంకా తెలియరాలేదని ఇజ్రాయెల్ చెప్పింది. డ్రాగన్ దేశం రాజధాని బీజింగ్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయంలో కాకుండా వేరేచోట ఈ దారుణమైన ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది. హమాస్ ఇజ్రాయెల్ భీకర యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దాడి ఆ దేశంలో కలకలం సృష్టిస్తోంది.

details

ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా హమాస్ ప్రజల నిరసనలు

గత శనివారం, అక్టోబర్ 6న దాదాపు 5 వేల క్షిపణులతో హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ) ఇజ్రాయెల్ దేశంపై విరుచుకుపడింది. ఈ మేరకు భీకర దాడులు చేయడంతో ఇజ్రాయెల్ కి చెందిన సివిలియన్స్(పౌరులు), ఆర్మీ సిబ్బందిని హతమార్చడంపై ఆ దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే గాజాపై వరుస దాడులతో బెంబెలెత్తిస్తోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విరుచుకుపడుతోంది. ఇదే సమయంలో ఇరుపక్షాల్లో తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు శక్రవారం పాలస్తీనా ప్రజలు తమ ఆందోళన తెలపాలని హమాస్ పిలుపునిచ్చింది. దీంతో పలు దేశాల్లో ముస్లింలు హమాస్‌కు మద్దతుగా ప్రార్థనలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల నిరసనలను ప్రదర్శిస్తూ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు. యుదులు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు హెచ్చరికలు చేశారు.