
Giorgia Meloni: వైట్‌హౌస్‌లో ట్రంప్ సీనియర్ సహాయకురాలికి 'నమస్తే'తో పలకరించిన మెలోని.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని తన ప్రత్యేకమైన దౌత్య శైలిని మరోసారి ప్రదర్శించారు. అమెరికా వైట్‌హౌస్‌లో జరిగిన ఒక ముఖ్య సమావేశంలో, సాధారణంగా ఉన్నతస్థాయి సమావేశాల్లో కనిపించే కరచాలనం లేదా అధికారిక పలకరింపుల బదులు, ఆమె భారతీయ సంప్రదాయం ప్రకారం రెండు చేతులు జోడించి 'నమస్తే' అంటూ ట్రంప్ సీనియర్ సహాయకురాలిని ఆహ్వానించారు. ఈ విధమైన అభివాదం,ఆ వేదికలో ఉన్న అందరి దృష్టినీ ఆకర్షించింది. సోమవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ భద్రతా హామీలపై దీర్ఘకాలిక వ్యూహం రూపొందించేందుకు కీలక సమావేశం జరిగింది. ఈ చర్చలకు హాజరైన మెలోని,ప్రత్యేకంగా 'నమస్తే'తో పలకరించడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు.
వివరాలు
మెలోని కీలక ప్రతిపాదన
ఇది మెలోని చేసిన మొదటి సందర్భం కాదు.గతేడాది ఇటలీలో జరిగిన జీ7 సదస్సులో కూడా ఆమె భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ వంటి అనేక ప్రపంచ నేతలను ఇలాగే నమస్కరించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి దారితీయకుండా ఉక్రెయిన్‌కు బలమైన భద్రతా హామీలు ఇవ్వడం ఎలా అన్న అంశంపై చర్చ సాగింది. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో పాటు అనేక యూరోపియన్ దేశాధినేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంలో మెలోని ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు.
వివరాలు
నాటోలో చేర్చకుండానే ఆర్టికల్ 5 తరహా భద్రత కల్పించాలని మెలోని ప్రతిపాదన
ఉక్రెయిన్‌ను నేరుగా నాటో సభ్య దేశంగా చేర్చకుండా, నాటో ఒప్పందంలోని ఆర్టికల్ 5 తరహా భద్రతా హామీలు ఇవ్వాలని ఆమె సూచించారు. ఈ ప్రతిపాదనపై మెలోని మాట్లాడుతూ.. "పశ్చిమ దేశాల ఐక్యతే శాంతిని కాపాడటానికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. మా ప్రతిపాదన ప్రకారం, ఉక్రెయిన్‌కు నాటో ఆర్టికల్ 5 తరహా రక్షణ హామీలు ఇవ్వాలన్న ఆలోచన మిత్రదేశాల మద్దతు పొందుతోంది. ప్రస్తుతం జరుగుతున్న దౌత్య చర్చల్లో ఇది ఒక కీలక అంశంగా మారింది" అని వివరించారు. ఈ వ్యూహం ద్వారా ఉక్రెయిన్ భద్రతా అవసరాలు తీర్చబడడమే కాకుండా, రష్యా ఆందోళనలూ పరిగణనలోకి తీసుకున్నట్లు అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'నమస్తే'తో మెరిసిన ప్రధాని మెలోని
It seems Modi's effect has been felt in Georgia Meloni
— Jay Lighty (@JayLighty_) August 18, 2025
Namaste 🙏🏻pic.twitter.com/Vlyi8dxF6j