LOADING...
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబాన్ని భారత్ చంపేసింది.. జైషే ఉగ్రవాది..
ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబాన్ని భారత్ చంపేసింది..జైషే ఉగ్రవాది..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబాన్ని భారత్ చంపేసింది.. జైషే ఉగ్రవాది..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2025
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కుటుంబ సభ్యుల్ని చంపితే ఎలా ఉంటుందో పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసి వస్తోంది. పహల్గామ్‌లో 26 మంది అమాయక వ్యక్తులను చంపి,వారి కుటుంబాల్లో తీరని వేధనను మిగిల్చిన ముష్కరులకు ''ఆపరేషన్ సిందూర్''తో భారత్ ధైర్యంగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సిందూర్ ప్రక్రియలో భారత్ వైమానిక దళం భారత్-పాకిస్థాన్ సరిహద్దు పరిధిలో ఉన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలపై దాడులు చేసింది. ఈ చర్యల ఫలితంగా 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

వివరాలు 

అజార్ కుటుంబం '',ముక్కలు.. ముక్కలు అయింది: కాశ్మీరీ

తదుపరి, మే 7న రాత్రి భారత సైన్యం పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలోని బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్‌పై భీకరమైన దాడి చేసింది. ఈ దాడిలో ముఖ్య ఉగ్రవాది నేత మౌలానా మసూద్ అజార్ కుటుంబం పూర్తిగా నశించిపోయింది. ఈ దాడి నిజమని తొలిసారిగా ఉగ్రసంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ స్పష్టంగా అంగీకరించారు. బహవల్పూర్‌లోని జామియా మసీదు సుబ్హాన్ అల్లాహ్ అనే జైషే ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ జరిగింది. దాడిలో అజార్ కుటుంబం '',ముక్కలు.. ముక్కలు అయింది'' అని కాశ్మీరీ వీడియో ద్వారా ప్రకటించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.

వివరాలు 

 పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది. భారత వైమానిక దళం సరిహద్దు దాటి, వందల కిలోమీటర్ల దూరంలోని పాకిస్తాన్ బహవల్పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. మొత్తం 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అతడి సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, మేన కోడలు, పిల్లలు కూడా ఉన్నారు. అదనంగా, మసూద్ అజార్‌కు చెందిన 4 సహాయక ఉగ్రవాదులు కూడా మరణించారు.

వివరాలు 

ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాది అజార్

అయితే, దాడికి సంబంధించిన వివరాలను పాకిస్తాన్ ఎప్పుడూ అంగీకరించకపోయినా, ఉగ్రవాదులు తమకు జరిగిన నష్టాలను ఇప్పుడిప్పుడే బయటపెడుతున్నారు. మసూద్ అజార్ ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్రవాదిగా వ్యవహరించబడుతున్నాడు. అతను 2016లో భారత భద్రతాప్రాంతం పఠాన్ కోట్‌లో జరిగిన దాడికి, అలాగే 2019లో 44 మంది భారత సైనికుల ప్రాణాలను బలిగొన్న పుల్వామా దాడికి ప్రధాన కారకుడిగా ఉంటున్నాడు. చివరిసారిగా మసూద్ అజార్ గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతంలో, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కనిపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న కాశ్మీరీ వీడియో