Joe Biden: అమెరికా అధ్యక్షుడిగా చివరి రోజు దక్షిణ కరోలినాలో బైడెన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా గద్దె దిగబోతున్న జో బైడెన్ తన పదవీకాలంలో చివరి రోజు ఆదివారం దక్షిణ కరోలినాలో గడిపారు.
2020లో డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి ఆ ప్రాంతం ఆయనకు ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉంది.
అక్కడి నుంచే ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించి శ్వేతసౌధం వరకు చేరుకున్నారు. తన పదవి ముగింపు సందర్భంగా ఆయన వీడ్కోలు ప్రసంగం చేయనున్నారు.
భార్య జిల్ బైడెన్‌తో కలిసి ఆయన రాయల్ మిషనరీ బాప్టిస్ట్ చర్చిని సందర్శించి,మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించి ప్రసంగిస్తారు.
అలాగే,1760-1808 మధ్య కాలంలో ఆఫ్రికా నుంచి అమెరికాకు బానిసలుగా తరలించబడిన వేలాది మందిని స్మరించుకుంటూ,అంతర్జాతీయ ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియాన్ని ఆయన సందర్శిస్తారు.
వివరాలు
శ్వేతసౌధంలో ఏర్పాట్లు
గతంలో తన విజయానికి తోడ్పడిన వారికి అక్కడి నుంచే కృతజ్ఞతలు తెలియజేస్తారు.
శ్వేతసౌధాన్ని బైడెన్ ఖాళీ చేయడం,ట్రంప్ ఆ భవనంలోకి రావడం కోసం కావాల్సిన ఏర్పాట్లను ఐదు గంటల్లో పూర్తి చేయాల్సి ఉండటంతో సంబంధిత సిబ్బంది తీవ్రంగా పని చేస్తున్నారు.
ఈమొత్తం ప్రక్రియ గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని,అన్ని చర్యలు పక్కాగా నిర్వహించాల్సి ఉంటుందని ట్రంప్ సతీమణి మెలనియా ఓ వార్తాసంస్థతో చెప్పారు.
గద్దె దిగబోతున్నఅధ్యక్షుడు జో బైడెన్,నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి శ్వేతసౌధం నుండి క్యాపిటల్ భవంతికి ప్రయాణిస్తారు.
అనంతరం,సిబ్బంది వారి వ్యక్తిగత సామగ్రితో సహా అన్నీ తగిన స్థానాల్లో సర్దుతారు.నిజానికి ఈ ఏర్పాట్లన్నీ గత నవంబర్ నెల నుంచే ప్రారంభమయ్యాయి,కానీ సోమవారం నాటికి పూర్తిగా ముగుస్తాయని భావిస్తున్నారు.