Page Loader
Kate Middleton: క్యాన్సర్‌ నుంచి బయటపడ్డట్లు.. ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ కీలక ప్రకటన
క్యాన్సర్‌ నుంచి బయటపడ్డట్లు.. ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ కీలక ప్రకటన

Kate Middleton: క్యాన్సర్‌ నుంచి బయటపడ్డట్లు.. ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్ యువరాజు విలియమ్ సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ కీలక ప్రకటన చేశారు. తాను క్యాన్సర్ నుంచి బయటపడ్డట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు ఎంతో ఉపశమనం ఉందని, ఇక నుంచి పూర్తిగా కోలుకోవడంపై దృష్టి సారిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా విలియమ్ దంపతులు రాయల్ మార్స్‌డెన్ ఆసుపత్రిని సందర్శించి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులను పరామర్శించి వారికి మద్దతు ఇచ్చారు.

వివరాలు 

క్యాన్సర్‌ను జయించడం నాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది: కేట్

''గతఏడాది నేను చికిత్స పొందిన సమయంలో ఆసుపత్రి సిబ్బంది నాకు అపారమైన సేవలు అందించారు.వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు వారి సహాయం అసాధారణం.ప్రస్తుతం రాయల్ మార్స్‌డెన్ ఆసుపత్రి సంయుక్త పోషకురాలిగా నా కొత్త పాత్రను ప్రారంభించాను.ఆసుపత్రి పరిశోధనలకు మద్దతు ఇవ్వడం,రోగులు,వారి కుటుంబాల శ్రేయస్సును ప్రోత్సహించడం,ఎక్కువ ప్రాణాలను కాపాడడం,క్యాన్సర్ బాధితుల అభిప్రాయాలను మార్చడం వంటి బాధ్యతలను నేను నెరవేరుస్తానని నమ్మకం.క్యాన్సర్‌ను జయించడం నాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది.ఇక పూర్తిగా కోలుకోవడంపై దృష్టి పెడతాను.సాధారణ జీవితానికి తిరిగి రావడానికి కొంత సమయం పట్టవచ్చు.ఈ అనుభవం క్యాన్సర్ బాధితులందరికీ మాత్రమే తెలుస్తుంది.కొత్త ఏడాదిలో చేయాల్సిన పనులపై దృష్టి సారిస్తాను.ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు''అని కేట్ మిడిల్టన్ తెలిపారు.

వివరాలు 

 3000కు పైగా స్వచ్ఛంద సంస్థలు, ఆసుపత్రులకు మద్దతు 

గత ఏడాది మార్చిలో క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు కేట్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె ప్రజా జీవితానికి దూరంగా ఉంటూ, ఆసుపత్రిలో క్రమబద్ధంగా కీమోథెరపీ తీసుకున్నారు. కేట్ చికిత్స పొందిన రాయల్ మార్స్‌డెన్ ఆసుపత్రికి విలియమ్ దంపతులు దాతలుగా ఉన్నారు. ఈ రాజ కుటుంబం 3000కు పైగా స్వచ్ఛంద సంస్థలు, ఆసుపత్రులకు మద్దతు ఇస్తోంది. ఈ నేపథ్యంలో, ఆసుపత్రిలో రోగులను పరామర్శించి, వారికి మద్దతు అందించడంలో ఈ దంపతులు చురుకుగా పాల్గొన్నారు.