LOADING...
Kim Jong-un: పుతిన్-కిమ్ జోంగ్-ఉన్ సమావేశం తర్వాత.. కూర్చున్న కుర్చీని తుడిచేసిన కిమ్ సిబ్బంది.. ఎందుకంటే? 
కూర్చున్న కుర్చీని తుడిచేసిన కిమ్ సిబ్బంది.. ఎందుకంటే?

Kim Jong-un: పుతిన్-కిమ్ జోంగ్-ఉన్ సమావేశం తర్వాత.. కూర్చున్న కుర్చీని తుడిచేసిన కిమ్ సిబ్బంది.. ఎందుకంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ చైనా రాజధాని బీజింగ్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బుధవారం వీరు విక్టరీ డే పరేడ్‌లో పాల్గొన్న తర్వాత,స్టేట్ గెస్ట్ హౌస్‌లో కలుసుకున్నారు. భేటీ ప్రారంభం కావడానికి ముందే పుతిన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు,కానీ, అనంతరం చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. భేటీ ముగిసిన తర్వాత, పుతిన్, కిమ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే, ఇద్దరు వ్యక్తులు వేగంగా వారు కూర్చున్న ప్రదేశం వద్దకు వచ్చారు. అందులో ఒకరు కిమ్ కూర్చున్న కుర్చీని తక్షణమే శుభ్రం చెయ్యగా..,మరొకరు ఆయన తాకిన ఫర్నీచర్‌ను క్లీన్‌ చేశారు.

వివరాలు 

పుతిన్‌ కూడా అంతే.. 

ఒకరు ఆయన వాడిన గ్లాస్‌ అతి జాగ్రత్తగా ట్రేలో పెట్టుకొని తీసుకెళ్లిపోగా ఆయనకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు ఆ ప్రాంతంలో లేకుండా క్లీన్‌ చేసేశారు. రష్యా జర్నలిస్ట్ ఒకరి ప్రకారం,ఇది అత్యంత జాగ్రత్తగా చేయాల్సిన చర్య, ఎందుకంటే ఉత్తరకొరియా అధ్యక్షుడి డీఎన్‌ఏ ఎవరికీ లభించకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. కాగా, దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఇటీవల అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇలాంటి జాగ్రత్తే తీసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..