Page Loader
Israel-Iran: ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు.. లీకైన అమెరికా ఇంటెలిజెన్స్ పత్రాలు!  
ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు

Israel-Iran: ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు.. లీకైన అమెరికా ఇంటెలిజెన్స్ పత్రాలు!  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2024
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

గత ఏడాది అక్టోబర్‌ 1న జరిగిన దాడికి ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధం చేసిన ప్లాన్లను పెంటగాన్‌ లీక్ చేసింది. ఈ సంబంధిత రెండు కీలక ఫైల్స్‌ను ఇరాన్‌ అనుకూలంగా ఉన్న 'మిడిల్‌ ఈస్ట్‌ స్పెక్టేటర్‌' టెలిగ్రామ్‌ ఛానల్‌లో పోస్టు చేశారు. పెంటగాన్‌ సోర్సుల నుండి ఈ సమాచారాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌ 15-16 తేదీల్లో ఇజ్రాయెల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చేసిన సన్నాహాల వివరాలు ఈ ఫైల్స్‌లో ఉన్నాయి. ఫైవ్‌ ఐస్‌ దేశాలు మాత్రమే ఈ సమాచారం అందుబాటులో ఉంచవచ్చని ఆ ఛానల్‌లో తెలిపారు.

వివరాలు 

ద్రువీకరించని యూఎస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ 

ఇజ్రాయెల్‌ ఇప్పటికే సంబంధిత ఆయుధాలను సిద్ధం చేసిందని ఈ పత్రాల్లో పేర్కొన్నది. ఆ దేశ వాయుసేన, భూలక్ష్యాలపై ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులు, మానవ రహిత విమానాలు, రిఫ్యూయలింగ్‌ ట్యాంక్‌లతో సాధన చేస్తున్నట్లు నేషనల్‌ జియోస్పేషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ వెల్లడించింది. వీటికి 16 గోల్డెన్‌ హారిజోన్‌ ఏల్‌బీఎం, 40ఐఎస్‌02 ఏఎల్‌బీఎంలను ఉపయోగించారని తెలిపింది. అయితే, ఈ పత్రాలు నిజమా లేదా అన్నది పెంటగాన్‌ లేదా యూఎస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ధ్రువీకరించలేదు. అమెరికా రక్షణ శాఖలోని అధికారులు ఈ పరిణామం చాలా అందోళనకరమని వ్యాఖ్యానించినట్లు సీఎన్‌ఎన్‌ తెలిపింది.

వివరాలు 

చివరి నిమిషంలో లక్ష్యాలు మారే అవకాశం 

ఇరాన్‌లో ఏ లక్ష్యాలను ధ్వంసం చేయాలన్న అంశంపై ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి ఇజ్రాయెల్‌ చేరుకున్నట్లు సమాచారం. ఈ మేరకు లక్ష్యాల జాబితాను ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్‌) ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్‌ గలాంట్‌కు సమర్పించినట్లు ఛానల్‌ 12 న్యూస్‌ తెలిపింది. "లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఎప్పుడు దాడి చేయాలన్నది నిర్ణయం కావాలి" అని కాన్‌ పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టర్‌ ఒక కథనం ప్రచురించింది. లక్ష్యాల పూర్తి జాబితాను అమెరికాకు ఇవ్వకపోయినా, సమాచారాన్ని అగ్రరాజ్యంతో ఇజ్రాయెల్‌ పంచుకున్నట్లు పేర్కొంది. చివరి నిమిషంలో లక్ష్యాలు మారే అవకాశాలను తోసిపుచ్చలేమని తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నవంబర్‌ 5కి ముందు ఏ సమయంలోనైనా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేయొచ్చని అగ్రరాజ్య అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.