Corrupt Countries: ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాల జాబితా విడుదల.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాల జాబితాను ఏటా ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేస్తుంది.
ప్రభుత్వ రంగంలో అవినీతి స్థాయిని నిపుణులు, వ్యాపారవేత్తల విశ్లేషణల ఆధారంగా అంచనా వేసి, అవినీతి భావదర్శక (CPI) సూచికను రూపొందిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా అవినీతి ఒక తీవ్రమైన, ప్రమాదకరమైన సమస్యగా కొనసాగుతున్నట్లు పేర్కొంది.
ఈ సూచిక ప్రకారం,డెన్మార్క్ ప్రపంచంలోనే అవినీతి రహిత దేశంగా ప్రథమ స్థానంలో నిలిచింది.
దీని తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. ఇ
క భారత్ ఈసారి 96వ స్థానాన్ని దక్కించుకుంది.మొత్తం 180 దేశాలకు ర్యాంకులు కేటాయించిన ఈ సూచికలో,స్కోరు 0 నుంచి 100 వరకు ఉంటాయి.
వివరాలు
96వ స్థానంలో భారత్
సున్నా అంటే అవినీతి రహిత దేశంగా భావించబడుతుండగా, 100 అంటే పూర్తిగా అత్యంత అవినీతి పాలిత దేశంగా పరిగణించబడుతుంది.
2024లో విడుదలైన అవినీతి సూచిక ప్రకారం, కొన్నిచోట్ల స్వల్ప మెరుగుదల కనిపించినప్పటికీ, భారతదేశం మాత్రం వెనుకబడింది.
2022లో 40 స్కోరు సాధించిన భారత్, 2023లో 39, ఇక 2024లో 38కు పడిపోయింది. గత ఏడాది 93వ స్థానంలో ఉన్న భారత్, ఈ ఏడాది 96వ స్థానానికి దిగజారింది.
భారత్‌కు పొరుగున ఉన్న దేశాల్లో పాకిస్తాన్ 135వ స్థానం, శ్రీలంక 121వ స్థానం, బంగ్లాదేశ్ 149వ స్థానాల్లో నిలిచాయి.
అమెరికా కూడా 69 స్కోరులో నుంచి 65కు పడిపోవడం గమనార్హం.
వివరాలు
75 స్కోరుతో 15వ స్థానంలో జర్మనీ
అలాగే, పాశ్చాత్య దేశాల్లో ఫ్రాన్స్ నాలుగు పాయింట్లు కోల్పోయి 67 స్కోరుతో 25వ స్థానానికి పడిపోయింది.
జర్మనీ కూడా 75 స్కోరుతో 15వ స్థానంలో నిలిచింది.
గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా, ఫ్రాన్స్, రష్యా, వెనిజులా వంటి దేశాలు అవినీతి సూచికలో వెనుకబడినట్లు ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
అలాగే, అవినీతి కేసుల్లో న్యాయ వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందున మెక్సికో ఐదు పాయింట్లు కోల్పోయి 26 స్కోరుతో నిలిచింది.
ప్రపంచంలో అత్యంత అవినీతి పాలిత దేశంగా దక్షిణ సూడాన్ కేవలం 8 పాయింట్లతో అట్టడుగున నిలవగా, సోమాలియా 9 స్కోరుతో రెండవ అతి అధ్వాన్న దేశంగా ఉంది.
వీటికి వెంటనే వెనిజులా (10), సిరియా (12) దేశాలు అవినీతికి కేరాఫ్‌గా మారాయి.
వివరాలు
అవినీతి నివారణ కోసం దేశాలు మరింత కృషి చేయాలి
సమాచార విశ్లేషణ ప్రకారం, 2024లో ప్రపంచవ్యాప్తంగా అవినీతి స్థాయిలు మరింత ఆందోళన కలిగించే విధంగా ఉన్నట్లు వెల్లడించబడింది.
2012 నుండి ఇప్పటివరకు 32 దేశాలు అవినీతిని తగ్గించుకోగలిగినప్పటికీ, 148 దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారిందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తెలియజేసింది.
కాబట్టి, అవినీతి నివారణ కోసం దేశాలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.