
Helicopter crash: నదిలో కూలిన పోలీస్ హెలికాప్టర్.. వైరల్ అయిన వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
మలేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జోహోర్‌లో ఉన్న పులాయ్ నదిలో మలేషియన్ పోలీస్ విభాగానికి చెందిన ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రముఖ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన మాక్ డ్రిల్ నిర్వహణ సమయంలో జరిగినట్లు మలేషియా పౌరవిమానయాన శాఖ అధికారికంగా వెల్లడించింది. మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్‌లు కలిసి నిర్వహిస్తున్న 'మిత్సతోమ్ 2025' అనే బహుళ దేశాల అణు భద్రతా పరిశోధనా కసరత్తు భాగంగా ఈ ప్రాక్టీస్ జరిగింది. ప్రారంభ కార్యక్రమానికి ఆయా దేశాలకు చెందిన వివిధ బృందాలు హాజరయ్యాయి.
వివరాలు
పైలట్‌తో పాటు మిగతా నలుగురిని సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ బృందాలు
ఈ కసరత్తులో భాగంగా మలేషియాకు చెందిన ఎయిర్‌బస్ AS355N హెలికాప్టర్ తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఎగరడం ప్రారంభించింది. అయితే, అది గెలాంగ్ పటా ప్రాంతంలోని మలేషియా మారిటైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (MMEA) జెట్టీ సమీపానికి చేరుకునే సమయంలో నిర్ధిష్ట కారణాలతో అదుపు తప్పి నదిలో కుప్పకూలింది. ప్రమాదం అనంతరం తక్షణమే రెస్క్యూ బృందాలు స్పందించి పైలట్‌తో పాటు మిగతా నలుగురిని సురక్షితంగా బయటకు తీశాయి. అయితే వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నట్టు సమాచారం అందింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..
WATCH: Police helicopter crashes into Pulai River in Johor, Malaysia, at least 5 people hospitalized. pic.twitter.com/3456sNg5xT
— AZ Intel (@AZ_Intel_) July 10, 2025