Page Loader
Donald Trump: ట్రంప్‌కు రూ.216 కోట్లు చెల్లించనున్న మెటా.. ఎందుకంటే..? 
ట్రంప్‌కు రూ.216 కోట్లు చెల్లించనున్న మెటా.. ఎందుకంటే..?

Donald Trump: ట్రంప్‌కు రూ.216 కోట్లు చెల్లించనున్న మెటా.. ఎందుకంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)తో మెటా (Meta) తన సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా ప్రయత్నిస్తోంది. క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన సమయంలో ట్రంప్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను నిషేధించిన విషయం తెలిసిందే. అప్పట్లో ట్రంప్‌ ఈ నిర్ణయంపై వ్యతిరేకంగా మెటా సంస్థపై దావా వేశారు. తాజా సమాచారం ప్రకారం, ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మెటా 25 మిలియన్‌ డాలర్లకు సెటిల్‌మెంట్‌ కుదుర్చుకున్నట్టు వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.

వివరాలు 

ట్రంప్‌ మెటా సంస్థపై కేసు

2021లో క్యాపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేయడంతో ఆయన ట్విటర్‌, ఫేస్‌బుక్‌ (Facebook), యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) ఖాతాలను బ్లాక్‌ చేశారు. అయితే 2023లో ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. కానీ అప్పటికే ట్రంప్‌ మెటా సంస్థపై కేసు వేశారు. తాజాగా మెటా ఈ వివాదాన్ని ముగించేందుకు ముందుకు వచ్చి, 25 మిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది. అందులో 22 మిలియన్‌ డాలర్లను ప్రెసిడెన్షియల్‌ లైబ్రెరీకి అందజేస్తారు, మిగిలిన మొత్తం కేసు ఖర్చులకు ఉపయోగించనున్నారు.

వివరాలు 

కొత్త లాయర్ల నియామకం 

హష్‌ మనీ కేసు (Hush Money Case)లో న్యూయార్క్‌ జడ్జి డొనాల్డ్ ట్రంప్‌కు శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తీర్పుపై తాను అప్పీల్‌కు వెళతానని ట్రంప్‌ ముందుగా ప్రకటించారు. ఈ క్రమంలో, ఆయన తన రక్షణ కోసం కొత్త లాయర్లను నియమించుకున్నారు. "అధ్యక్షుడు ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని క్రిమినల్‌ చట్టాన్ని దుర్వినియోగం చేశారు. ఇది ప్రమాదకరమైన పరిణామం. న్యూయార్క్‌ జడ్జి తీర్పుపై మేము అప్పీల్‌ దాఖలు చేస్తాం. కేసు కొట్టివేసే వరకు పోరాడుతాం" అని ట్రంప్‌ కొత్త న్యాయవాది రాబర్ట్‌ గియుఫ్రా తెలిపారు.