Page Loader
Narendra Modi: 'క్యాన్సర్‌ మూన్‌షాట్‌'లో మోదీ కీలక ప్రకటన.. 40 మిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌ల సాయం
'క్యాన్సర్‌ మూన్‌షాట్‌'లో మోదీ కీలక ప్రకటన.. 40 మిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌ల సాయం

Narendra Modi: 'క్యాన్సర్‌ మూన్‌షాట్‌'లో మోదీ కీలక ప్రకటన.. 40 మిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌ల సాయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2024
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో క్యాన్సర్‌ మూన్‌షాట్‌ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఇండో-పసిఫిక్‌ దేశాలకు 40 మిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌లను అందిస్తామని మోదీ చెప్పారు. ఈ సాయంతో క్యాన్సర్‌తో పోరాడే కోట్లాది మంది ప్రజల జీవితాల్లో కీలక మార్పులను తీసుకురావచ్చన్నారు. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్‌ నివారణ కోసం క్వాడ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, దీనికి సంబంధించి 7.5 మిలియన్ డాలర్ల విలువైన నమూనా కిట్‌లు అందిస్తున్నామన్నారు. క్యాన్సర్‌ మూన్‌షాట్‌ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో కలిసి భారత ప్రధాని మోదీ హాజరయ్యారు.

Details

క్యాన్సర్ తో పోరాడేందుకు కీలక నిర్ణయాలు

ఇరు దేశాలు క్వాడ్‌ చొరవ కింద క్యాన్సర్‌తో పోరాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయని, ఈ క్రమంలో 40 మిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌లు అందించడం ప్రధాన లక్ష్యంగా ఉందన్నారు. గర్భాశయ క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో ప్రపంచ నేతల సహకారం ఎంతో అవసరమని మోదీ పిలుపునిచ్చారు. క్యాన్సర్‌ నిరోధానికి 2016లో ప్రారంభమైన మూన్‌షాట్‌ కార్యక్రమం, 2022లో బైడెన్‌ ఆధ్వర్యంలో పునరుద్ధరించారు. ప్రపంచవ్యాప్తంగా ఐదు దేశాల్లో 95 కార్యక్రమాలు, వనరులు అందించిన ఈ చొరవకు, ప్రధాన భాగస్వామిగా భారత్‌ తన సాయమందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.