Page Loader
NATO: భారత్‌కు నాటో హెచ్చరికలు.. రష్యాతో వ్యాపారం చేస్తే 100 శాతం సుంకం 
NATO: భారత్‌కు నాటో హెచ్చరికలు.. రష్యాతో వ్యాపారం చేస్తే 100 శాతం సుంకం

NATO: భారత్‌కు నాటో హెచ్చరికలు.. రష్యాతో వ్యాపారం చేస్తే 100 శాతం సుంకం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌తో జరుగుతున్నయుద్ధాన్నిఆపేందుకు రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని అమెరికా కృషి చేస్తోంది. ఈ దిశగా, రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై దిగుబడి సుంకాలు (టారిఫ్‌లు) విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో,మాస్కోతో వ్యాపారం కొనసాగిస్తే భారత్, చైనా, బ్రెజిల్ లాంటి దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని నాటో (NATO) ఘాటుగా సూచించింది. నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుత్తే అమెరికా సెనేటర్లతో సమావేశమైన అనంతరం మాట్లాడారు. "చైనా అధ్యక్షుడు,భారత ప్రధానమంత్రి,బ్రెజిల్ అధ్యక్షుడు.. వీరెవరైనా రష్యాతో వ్యాపారం కొనసాగించి చమురు లేదా గ్యాస్‌ను కొనుగోలు చేస్తే,ఆ చర్యలను తీవ్రంగా పరిగణిస్తాం.అటువంటి దేశాలపై పూర్తి స్థాయి టారిఫ్‌లు.. అంటే 100 శాతం సుంకాలు..విధించేందుకు సిద్ధంగా ఉన్నాం," అని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

భారత్,చైనా,బ్రెజిల్‌లకు తీవ్రమైన పరిణామాలు

మాస్కోలో ఉన్న నేత (వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశిస్తూ) శాంతి చర్చల్లో పాల్గొనకపోతే పరిస్థితి విషమమవుతుందని హెచ్చరించారు. ఆయా దేశాల నాయకులు పుతిన్‌ను సంప్రదించి,చర్చల దిశగా మద్దతు ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. లేకుంటే భారత్,చైనా,బ్రెజిల్‌లకు తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని అన్నారు. ఈ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌కు కేవలం ఎయిర్ డిఫెన్స్‌లే కాకుండా భారీగా క్షిపణులను కూడా అందించనున్నట్లు తెలిసింది. రష్యాపై ట్రంప్ తీసుకుంటున్న ఆంక్షల విధానాన్ని యూఎస్ రిపబ్లికన్ సెనేటర్ థామ్ టిల్లిస్ ప్రశంసించారు. అయితే, 50 రోజుల గడువు ఇవ్వడం తనకు ఆందోళన కలిగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమయాన్ని ఉపయోగించుకొని పుతిన్ మరిన్ని భూభాగాలను ఆక్రమించే ప్రయత్నం చేస్తారని హెచ్చరించారు.

వివరాలు 

రష్యా వైఖరిపై ట్రంప్ సీరియస్‌

అంతేకాక, తీవ్ర హింసకు పాల్పడి అనంతరం చర్చలకు ముందుకొచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇదిలాఉండగా, రష్యా వైఖరిపై ట్రంప్ సీరియస్‌గా ఉన్నారు. యుద్ధానికి ముగింపు లేకుండా 50 రోజుల లోపల ఒప్పందానికి రాకపోతే, మరింత తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు మాస్కోపై విధిస్తామని హెచ్చరించారు. అయితే ఈ బెదిరింపులను రష్యా లెక్కచేయలేదు. తమపై వచ్చే అదనపు ఆంక్షలను ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ స్పష్టం చేశారు.