
Navarro: SCO సమ్మిట్‌లో జి జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ అసౌకర్యంగా ఉన్నారు.. నవారో సరికొత్త వాదన..!
ఈ వార్తాకథనం ఏంటి
తియాంజిన్‌లోని షాంఘై సహకార సంస్థ (SCO) సమ్మేళనంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసౌకర్యంగా ఉన్నారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఎస్‌సీవో సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పక్కన నిలబడినప్పుడు ప్రధాన మంత్రి మోదీ ఎంతో అసౌకర్యంగా ఉన్నారని నవారో వివరించారు. నవారో అభిప్రాయం ప్రకారం,"రష్యా నుండి భారత్ చమురు దిగుమతి చేసుకోవడం ఒక సమస్య. 2022కంటే ముందు భారత్ ఎటువంటి రష్యా చమురు కొనుగోలు చేయలేదు.యుద్ధం మొదలైన వెంటనే,భారత రిఫైనరీలు రష్యా చమురు పరిశుద్ధి సంస్థలతో సంబంధాలు కలిగించడం ప్రారంభించాయి. వారు వాణిజ్య పరంగా నిబంధనలను తప్పిస్తూ,అనైతిక వ్యాపారంలో డబ్బు సంపాదిస్తున్నారు"అని అన్నారు.
వివరాలు
రష్యా ఆ సొమ్ముతో ఆయుధాలు కొంటుంది: నవారో
అంతేకాక, భారత్ ఇప్పటికే ఈ విషయంపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్టుగా నవారో తెలిపారు. ధాని మోదీ (PM Modi) నిర్మాణాత్మకమైన ఓ ట్వీట్ చేశారని, దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారని చెప్పారు. రెండు దేశాలు వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తునట్టు ఆయన తెలిపారు. "భారతదేశంలో టారిఫ్‌లు,టారీఫేతర అడ్డంకులు అత్యధికంగా ఉన్నాయి. భారత్ రష్యా చమురు కొంటే, రష్యా ఆ డబ్బుతో ఆయుధాలు కొంటుంది. మా పన్ను చెల్లింపుదారులు ఉక్రెయిన్ రక్షణ కోసం భారీగా చెల్లిస్తున్నాయి" అని నవారో అన్నారు. కాగా, ఎస్‌సీవో సదస్సులో ప్రధాన మంత్రి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పక్కన ఉన్నప్పుడు సౌకర్యంగా కనిపించలేదని నవారో ప్రత్యేకంగా పేర్కొన్నారు.