LOADING...
Nepal: నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం 
Nepal: నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం

Nepal: నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో ప్రాచుర్యం పొందిన అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పూర్తిగా నిషేధం విధించింది. నేపాల్‌ ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశిస్తూ ఫేస్‌ బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్, రెడిట్, వాట్సాప్, స్నాప్‌చాట్ సహా 26 ప్రధాన సోషల్ మీడియా, కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ల యాక్సెస్‌ను బ్లాక్ చేయమని సూచించింది. ఈ నిర్ణయం ఆ కంపెనీలు 7 రోజుల్లో ప్రభుత్వ దగ్గర నమోదు కాకపోవడంతో తీసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేపాల్‌లో ఫేస్‌బుక్, X, యూట్యూబ్, నిషేధం

వివరాలు 

 సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఆదేశాల తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల బ్లాక్ 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేయడం సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఆదేశాల తర్వాత తీసుకున్న నిర్ణయం. కొర్ట్ ఒక కాంటెంప్ట్ కేసులో (Case No. 080-8-0012) ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, దేశీయ, విదేశీ మూలాల ఉన్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు దేశంలో పనిచేసే ముందు సంబంధిత అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని, అలాగే అవాంఛనీయ కంటెంట్‌పై పర్యవేక్షణ చేపట్టాలని తెలిపింది. నేపాల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆ నిర్ణయాన్ని (2082.05.09) అనుసరిస్తూ, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2082.05.12 న ప్రజలకు ఒక నోటీసు జారీ చేసింది. ఇందులో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను 'Directive on Regulating the Use of Social Media, 2080' ప్రకారం 7 రోజుల్లో నమోదు చేయమని ఆదేశం ఇచ్చింది.

వివరాలు 

నమోదు చేసుకోని ప్లాట్‌ఫామ్‌లు నిష్క్రియం

నియమావళి ప్రకారం, ఈ సమయములో నమోదు చేసుకోని ప్లాట్‌ఫామ్‌లు నిష్క్రియం చేయబడతాయి, కానీ నమోదు పూర్తి అయిన వెంటనే తిరిగి యాక్టివ్ అవుతాయి. సుప్రీంకోర్ట్ 2020 నుంచి అనేక పిటిషన్లను పరిశీలించింది. ఈ పిటిషన్లలో లైసెన్స్ లేకుండా ప్రకటనలు, కంటెంట్ ప్రసారం చేస్తున్న ప్లాట్‌ఫామ్‌లపై నియంత్రణలు పెట్టాలని కోరారు. నేపాల్‌లో సోషల్ మీడియా వినియోగం నియంత్రించడానికి 2080 ఆదేశం ప్రకారం, ప్రతి ప్లాట్‌ఫామ్ మంత్రిత్వ శాఖలో నమోదు కావాలి, లోకల్ కాంటాక్ట్ పర్సన్, కాంప్లయన్స్ ఆఫీసర్ ఉండాలి , అలాగే స్థానిక ఫిర్యాదులు పరిష్కరించే మార్గాలు ఏర్పాటుచేయాలి.

వివరాలు 

బ్లాక్ అయ్యినవి..పనిచేస్తున్నవి :

బ్లాక్‌: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డ్ఇన్, వాట్సాప్, డిస్కార్డ్, పింటరెస్ట్, సిగ్నల్, థ్రెడ్స్, వీచాట్, క్వోరా, టంబ్లర్, క్లబ్‌హౌస్, రంబుల్, లైన్, ఇమో, జాలో, సొల్, హమ్రో పత్రో, మి వీడియో, మి వికే3 ఇంకా పనిచేస్తున్నవి: టిక్‌టాక్, వైబర్, వెటాక్, నింబజ్ (నమోదు అయ్యింది), టెలిగ్రామ్, గ్లోబల్ డైరీ (ప్రక్రియలో)

వివరాలు 

సివిల్ సొసైటీ నుండి ఎక్కువ విమర్శలు

"ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నమోదు చేసుకోవాలని అనేకసార్లు కోరింది, కానీ వారు పట్టించుకోలేదు. కంపెనీలు నమోదు పూర్తిచేస్తే, సేవలు తిరిగి అందుబాటులోకి వస్తాయి"అని నేపాల్ కమ్యూనికేషన్స్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ చెప్పారు. కానీ కొన్ని హక్కుల సంస్థలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వారు, "ఇది అభివ్యక్తి స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యానికి ముప్పు" అని చెప్పారు. 'కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్' 'Access Now' సంస్థలు దీన్ని విస్తృతమైన సెన్సార్‌షిప్‌గా పిలిచేలా, పారదర్శకతతో యాక్సెస్ తిరిగి ఇవ్వాలని కోరారు. ఇకపై పార్లమెంట్‌లో దేశ హితానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌పై జరిమానాలు, జైలు శిక్షలు విధించే సోషల్ మీడియా బిల్లుపై చర్చిస్తున్నారు. దీనిపై సివిల్ సొసైటీ నుండి ఎక్కువ విమర్శలు వస్తున్నాయి.