Loading...
#NewsBytesExplainer: యూరప్‌ దేశాల్లో నిరసనల సెగ.. యువత ఆగ్రహానికి కారణాలివే!
యూరప్‌ దేశాల్లో నిరసనల సెగ.. యువత ఆగ్రహానికి కారణాలివే!

#NewsBytesExplainer: యూరప్‌ దేశాల్లో నిరసనల సెగ.. యువత ఆగ్రహానికి కారణాలివే!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూరప్‌ దేశాల్లో నిరసనల సెగ పెరుగుతోంది. విద్యా వ్యవస్థలో సమస్యలు, ఇళ్ల అద్దెల పెరుగుదల, జీవన వ్యయం భారంతో యువత సహా ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. ఫ్రాన్స్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీ, బెల్జియం, అల్బేనియా దేశాల్లో వివిధ కారణాలతో ఆందోళనలు జరుగుతున్నాయి. పెట్రోల్‌ ధరలు పెరగడం,ఉద్యోగాల కొరత,ప్రభుత్వాల విధానాలపై అసంతృప్తి కూడా ఈ నిరసనలకు కారణమవుతున్నాయి. ఫ్రాన్స్‌లో సెప్టెంబర్‌ చివరి వారంలో మొదలైన విద్యార్థుల ఆందోళనలు క్రమంగా తీవ్రరూపం దాల్చాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, ఎక్కువ పని గంటలు, శిథిలావస్థలో తరగతి గదులు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల ప్రక్రియపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ కాకపోవడంతో కొన్ని చోట్ల నెలల తరబడి పాఠాలు చెప్పే పరిస్థితి లేకుండా పోతోంది.

వివరాలు 

ఇంధన ధరల పెరుగుదల కూడా ఆందోళన

ఈ నిరసనలకు కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.

ధరలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని,పెన్షన్లను మెరుగుపరచాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇంధన ధరల పెరుగుదల కూడా ఆందోళనలను మరింత పెంచింది.

అమెరికా బాంబు దాడుల తర్వాత హర్ముజ్‌ జలసంధి కార్యకలాపాలు దెబ్బతినడం ఇంధన సరఫరాపై ప్రభావం చూపింది.

స్పెయిన్‌లో ఇళ్ల అద్దెలు, ధరలు పెరగడంపై సెప్టెంబర్‌లో నిరసనలు మొదలయ్యాయి.

87 ఏళ్ల మారికార్మెన్‌ అబాస్కల్‌ ఉంటున్న ఇంటి అద్దెను ఓ పెట్టుబడి సంస్థ ఏకంగా 230 శాతం పెంచింది.

దీంతో ఆమె ఆ ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే, ఆసుపత్రిలో చేరిన ఆమె రెండు వారాల తర్వాత మృతి చెందారు.

వివరాలు 

ఇటలీలో జీవన వ్యయ భారానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు

దీంతో అద్దెలు తగ్గించాలని, బలవంతపు ఖాళీలను నిలిపివేయాలని, పెట్టుబడి సంస్థలు ఇళ్లు కొనుగోలు చేయకుండా నియంత్రించాలని నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

పోర్చుగల్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 2015 నుంచి 2024 మధ్య అక్కడ ఇళ్ల ధరలు 124 శాతం పెరిగాయి.

ఇది యూరోపియన్‌ యూనియన్‌ సగటు పెరుగుదలకు దాదాపు రెండింతలు.

ఇటలీలోని మిలాన్‌లోనూ జీవన వ్యయ భారానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి.

తొలుత ప్రశాంతంగా సాగిన ర్యాలీ తర్వాత హింసాత్మకంగా మారింది.

మరోవైపు అల్బేనియాలో ప్రధానమంత్రి ఈడి రామాపై నిరసనలు ఆరో రోజుకు చేరాయి.

అవినీతి ఆరోపణలు, ఉద్యోగాల కొరత, విద్యా ప్రమాణాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ఆందోళనలు వేసవిలోనే ప్రారంభమయ్యాయి.

ADVERTISEMENT

వివరాలు 

పాఠశాలల నిర్ణయాల్లో విద్యార్థులకు భాగస్వామ్యం

ఫ్రాన్స్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం అదనంగా 3,000 మంది ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులను నియమిస్తామని ప్రకటించింది.

పాఠశాలల నిర్ణయాల్లో విద్యార్థులకు భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపింది.

విశ్వవిద్యాలయాల రిజిస్ట్రేషన్‌ ఫీజుల పెంపు ప్రతిపాదనను కూడా వెనక్కి తీసుకుంది.

ఇంధన ధరలపై నిరసనల నేపథ్యంలో కొన్ని రంగాలకు పెట్రోల్‌ సబ్సిడీలు పెంచే చర్యలను ప్రకటించింది.

ADVERTISEMENT

వివరాలు 

స్పెయిన్‌లో నవంబర్‌ 29న ముందస్తు ఎన్నికలు

స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ అద్దెదారులకు రక్షణ కల్పించే అత్యవసర గృహ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించినా పార్లమెంటులో ఆమోదం పొందలేదు.

దీంతో నవంబర్‌ 29న ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ కూడా కీలక మంత్రులతో సమావేశం తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

2027 ఏప్రిల్‌లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. గృహ సమస్యల పరిష్కారం, ధరల నియంత్రణ, విద్యా వ్యవస్థలో మార్పులపై ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలే ఈ నిరసనలు ఎంతవరకు తగ్గుతాయో నిర్ణయించనున్నాయి.

ADVERTISEMENT