రష్యా గడ్డపై అడుగుపెట్టిన కిమ్ జోంగ్ ఉన్.. ఆ రైలు మాత్రం చాలా ప్రత్యేకం గురూ
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విలాసవంతమైన రైల్లో రష్యాలో అడుగుపెట్టారు. ఆదివారం మధ్యాహ్నం ప్యాంగ్యాంగ్ నుంచి బయల్దేరిన కిమ్, నేడు ఆ దేశంలో ప్రవేశించారు. ఈ మేరకు కొరియన్ మీడియా నిర్థారించింది. భారీ సాయుధ రైల్లో సుమారు 20 గంటలకుపైగా ప్రయాణించి రష్యా చేరుకున్నారు. ఇవాళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కిమ్ సమావేశమవనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు శతఘ్ని గుండ్లు, మందుగుండు సామగ్రి భారీ స్థాయిలో అవసరం ఉన్న క్రమంలో కిమ్‌తో ఒప్పందాలు జరగనుంది. మరోవైపు అమెరికా హెచ్చరికలను పట్టించుకోమని, క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. ప్రపంచ దేశాల్లో ఒంటరి అయినందుకే రష్యా-కొరియాలు ఒకరికొకరు తోడయ్యారని అమెరికా చురకలు అంటించింది.
కిమ్ తండ్రి కిమ్ ఇల్ సంగ్‌కు గుర్తుగా రైలుకు ఆ పేరు పెట్టారు
గంటకు 50 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణం ఎన్నో ప్రత్యేకతలున్న ఈ రైలు పేరు తయాంఘో. కొరియన్ భాషలో సూర్యుడు అని అర్థం. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, కిమ్ తండ్రి కిమ్ ఇల్ సంగ్‌కు గుర్తుగా విలాసవంతమైన రైలుకు ఈ పేరు పెట్టారు. అప్పట్నుంచే ఉ.కొరియా నేతలు దూర ప్రాంతలకూ రైల్లోనే వెళ్లడం ప్రారంభమైంది. తాజాగా ఈ రైలు గంటకు కేవలం 50 కి.మీ వేగంతోనే రష్యా చేరుకుంది. ఇందులో భారీగా సాయుధ కవచాలు అమర్చి ఉండటంతో వేగం సాధ్యపడలేదు. తయాంఘో రైలుకు భారీగా సాయుధ దళాల రక్షణ కల్పిస్తారు. స్టేషన్లు, మార్గాలను నిత్యం తనిఖీ చేస్తారు. ఉ.కొరియా రైల్లో రష్యన్, చైనీస్, కొరియన్, జపనీస్, ఫ్రెంచి వంటకాలను సిద్ధంగా ఉంటాయి.