
Trump Tariffs: ట్రంప్ కొత్త టారిఫ్‌లు ఆగస్ట్ 7 కాదు.. అక్టోబర్ 5 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. ప్రపంచంలోని పలు దేశాలపై 'సవరిస్తున్న పరస్పర టారిఫ్‌లు' (modified reciprocal tariffs) అమలు చేసేలా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే, వెంటనే కాకుండా కొన్ని రోజులు గడువు ఇవ్వబోతున్నట్లు సమాచారం. మొదట August 1 నుంచే ఈ టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని భావించగా... తాజా ప్రకటన ప్రకారం అవి ఆగష్టు 7, ఉదయం 12:01 గంటలకు (స్థానిక సమయం ప్రకారం) అమల్లోకి రానున్నాయి. కానీ ఈలోగా ఏదైనా దేశం అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే, టారిఫ్‌లు మారే అవకాశం ఉంది.
వివరాలు
కొత్త టారిఫ్‌లు వల్ల కొన్ని దేశాలకు తాత్కాలిక ఊరట
అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ట్రంప్ సంతకం చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఆగస్ట్ 7కు ముందే షిప్‌లో ఎక్కిన సరకులు,అక్టోబర్ 5కి ముందే అమెరికా దేశంలోకి చేరితే, అవి మాత్రం పాత టారిఫ్ రేట్లకే లోబడి ఉంటాయి. అంటే కొత్త టారిఫ్‌లు వాటికి వర్తించవు. దీని వల్ల కొన్ని దేశాలకు తాత్కాలిక ఊరట లభించనుంది. ఇకపోతే ట్రంప్ ప్రకటించిన ఈ టారిఫ్‌లలో ఇంకో ముఖ్యమైన అంశం ఉంది. ఎక్కువ భాగం టారిఫ్‌లు 7 రోజుల్లో అమల్లోకి వస్తాయి.కానీ కెనడా విషయంలో మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. కెనడా నుంచి దిగుమతి అయ్యే సరుకులపై శుక్రవారం ఉదయం 12:01 గంటల నుంచే 35 శాతం టారిఫ్ విధించనున్నట్టు వెల్లడించారు.
వివరాలు
ట్రంప్ కొత్త ఆర్డర్‌లో మరో షాకింగ్ డీటెయిల్
ఇదిలో మిస్టరీ ఏమిటంటే - అమెరికా-మెక్సికో-కెనడా మధ్య ట్రేడ్ ఒప్పందంలో కొన్ని వస్తువులు మినహాయింపులకు గురయ్యే అవకాశం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాదు,ట్రంప్ కొత్త ఆర్డర్‌లో మరో షాకింగ్ డీటెయిల్ ఉంది. అది ఏమిటంటే.."ట్రాన్స్‌షిప్"అనే అంశం.అంటే ఒక దేశంలో తయారైన వస్తువులను ఇంకొక దేశం ద్వారా గమ్యదేశానికి తరలించి ప్యాకింగ్ మార్చడం లాంటివి చేస్తే,వాటిపై 40శాతం టారిఫ్ విధిస్తారు. అమెరికా కస్టమ్స్ ఈ వ్యవహారాన్ని పసిగట్టి చర్యలు తీసుకోనుంది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ట్రంప్ నాలుగు వారాల క్రితం వియత్నాం దేశంతో కుదుర్చుకున్న ట్రేడ్ ఒప్పందంలో ఈ "ట్రాన్స్‌షిప్" అంశం ఉంది. కానీ తర్వాతి ఒప్పందాల్లో అది కనిపించలేదు.అంటే ఇతర దేశాలకు ఇది ముందుగా తెలియకపోయే అవకాశం ఉంది.
వివరాలు
దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్జాతీయ సంప్రదాయాలకు బ్రేక్
ఇతర దేశాలతో కలసి ప్రపంచ వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) ఇప్పటివరకు పలు ప్రమాణాలను అమలు చేసింది. కానీ ట్రంప్ మాత్రం వాటిని పక్కనబెట్టి, తన స్టైల్లో దేశానుసారం టారిఫ్‌లు విధించే విధానానికి షిప్ట్ అయ్యారు. దీని ద్వారా గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్జాతీయ సంప్రదాయాలకు బ్రేక్ వేసినట్లయింది. ఇక చివరగా, ట్రంప్ ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడిన ఓ సీనియర్ అధికారి "అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్లోబల్ ట్రేడ్ పద్ధతులను పూర్తిగా మార్చేశారు. గత 25 ఏళ్లుగా WTO సాధించలేకపోయిన ఫలితాలను ట్రంప్ ఒక్కచోటే సాధించే దిశగా పయనిస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.