Page Loader
US Elections 2024: రేపు యూఎస్ అధ్యక్ష ఎన్నికలు.. చివరి అంకానికి చేరిన అభ్యర్థుల ప్రచారం..
రేపు యూఎస్ అధ్యక్ష ఎన్నికలు.. చివరి అంకానికి చేరిన అభ్యర్థుల ప్రచారం..

US Elections 2024: రేపు యూఎస్ అధ్యక్ష ఎన్నికలు.. చివరి అంకానికి చేరిన అభ్యర్థుల ప్రచారం..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2024
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా ముందస్తు ఓటింగ్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది పోలింగ్ తేదీకి ముందుగానే కోట్లాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రేపు (మంగళవారం) ప్రధాన పోలింగ్‌ జరగనుండగా, ఇప్పటివరకు 6.8 కోట్ల మంది అమెరికా పౌరులు ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరోవైపు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ తమ ప్రచారంలో చివరి అంకానికి చేరుకుని, ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

వివరాలు 

ఏర్పాట్లలో బిజీగా బోర్డు ఆఫ్ ఎలక్షన్స్‌ కార్యాలయం

ఈసారి ముందస్తు ఓటింగ్‌ కోసం అధిక సంఖ్యలో ఓటర్లు ముందుకు రావడంతో, పోలింగ్‌ కేంద్రాలను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. న్యూయార్క్‌లోని 42 బ్రాడ్‌వేలో ఉన్న బోర్డు ఆఫ్ ఎలక్షన్స్‌ కార్యాలయం ఏర్పాట్లలో బిజీగా ఉంది. బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్, ఆయన డిప్యూటీ విన్సెంట్ ఇగ్నిజియో ఎన్నికల పనుల్లో వేగం పెంచారు. న్యూయార్క్‌ ముందస్తు ఓటింగ్‌లో రికార్డు సృష్టించిందని, ఇది ఇంకా కొనసాగుతోందని ర్యాన్ వెల్లడించారు. న్యూయార్క్‌ మాత్రమే కాకుండా మొత్తం అమెరికా వ్యాప్తంగా ఈ ట్రెండ్‌ కొనసాగుతోంది. మెయిల్‌, పోలింగ్‌ కేంద్రాల ద్వారా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు.

వివరాలు 

50% అదనంగా పోలింగ్ కేంద్రాలు 

గత ఎన్నికల్లో న్యూయార్క్‌లో 100 ముందస్తు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈ సారి 50% అదనంగా ఏర్పాటు చేశారు. అసాధారణ వాతావరణం, పోలింగ్ రోజున భారీ క్యూలు, ఇతర సమస్యలు ముందస్తు ఓటింగ్‌కు కారణమయ్యాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అభ్యర్థుల ప్రచారం ముగింపు దశలో ఉంది. ట్రంప్‌ తనకు మద్దతుగా నిలిచిన నార్త్‌ కరోలినాలో ప్రచారం చేస్తున్నారు. కమలా హారిస్‌ వరుస ఇంటర్వ్యూలతో ప్రచారంలో బిజీగా ఉన్నారు. రేపు కూడా ట్రంప్‌ నార్త్ కరోలినాలో ర్యాలీలు నిర్వహించనున్నారు. 2016, 2020లలో తనకు మద్దతుగా నిలిచిన ఈ రాష్ట్రంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు.

వివరాలు 

 న్యూమెక్సికో,వర్జీనియా రాష్ట్రాలను సీరియస్‌గా తీసుకున్న ట్రంప్‌ 

అలాగే, ట్రంప్‌ న్యూమెక్సికో, వర్జీనియా వంటి రాష్ట్రాలను కూడా సీరియస్‌గా తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా నార్త్‌ కరోలినాలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. కమలా హారిస్‌ కూడా ఛార్లెట్‌లో ప్రచారం చేశారు, ఆమె భర్త డగ్ ఎంహాఫ్‌ను కూడా ప్రచారంలో భాగస్వామ్యం చేశారు.