
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్'పై స్పందించిన ప్రపంచ నేతలు
ఈ వార్తాకథనం ఏంటి
'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై తీవ్రమైన ప్రతికార చర్యలు ప్రారంభించింది.
ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ఈ మెరుపుదాడులు జరిపింది.
ఈ దాడులపై ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై ప్రపంచ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఇరుదేశాల పరిస్థితి ఆందోళనకరం అని, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు.
ఈ దాడులు త్వరగా ముగిశీ, శాంతి తిరిగి నెలకొలిపోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్క్ రూబియోతో ఈ ఘటనపై మాట్లాడారు.
వివరాలు
అంతర్జాతీయ నేతల స్పందన
"ఇలాంటి పరిణామాలు త్వరగా ముగిసిపోవాలి. భారత్, పాకిస్తాన్ రెండు శక్తివంతమైన దేశాలు. వీటికి మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు. చరిత్రలో ఈ రెండు దేశాలకు ఎన్నో వివాదాలు ఉన్నాయి. కానీ ప్రపంచం శాంతిని కోరుతోంది.అందుకే ఘర్షణలు అవసరం లేదు" అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
"భారత్ తగినంత ఆత్మరక్షణ కోసం చర్యలు చేపడుతోంది. అమాయకులపై దాడి చేసి పరారయ్యే ఉగ్రవాదుల తీరును ఉపేక్షించలేం. భారత్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది" అని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ స్పందించారు.
వివరాలు
అంతర్జాతీయ నేతల స్పందన
"భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులను మేము కచ్చితంగా గమనిస్తున్నాం. శాంతియుత పరిష్కార దిశగా ఇరుదేశాలూ చర్చలు జరపాలి" అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు.
"ఇరుదేశాల సైనికులు సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలు పెరగకుండా జాగ్రత్త వహించాలి" అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అన్నారు.
"భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను ప్రపంచం భరించలేదు. ఇరుదేశాలూ సంయమనం పాటించాలి. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి" అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉప ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ పేర్కొన్నారు.