
Operation Sindoor: 'మా యుద్ధవిమానం నేలకూలింది'.. పాకిస్థాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని, ఆ దేశ అత్యాధునిక యుద్ధవిమానాలను కూల్చినట్టు భారత సైన్యం ఇప్పటికే ప్రకటించింది.
ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ ఆర్మీ అధికారికంగా స్పందించింది. తమ ఫైటర్ జెట్ ఒకటి ధ్వంసమైన విషయం వాస్తవమేనని అంగీకరించింది.
అయితే ఆ నష్టం స్వల్పంగా ఉండటాన్ని మాత్రమే హైలైట్ చేసింది. ఈ విషయమై పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ, తమ దేశ ఎయిర్‌ఫోర్స్, నేవీ ఉన్నతాధికారులతో కలిసి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణల్లో పాక్ వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం స్వల్పంగా ధ్వంసమైందని వెల్లడించారు.
Details
నివేదికను విడుదల చేసిన భారత సైన్యం
అయితే, ఈ దాడిలో జరిగిన నష్టం తీవ్రతపై ఎలాంటి వివరాలు అందించలేదు.
భారత సైన్యం ఆదివారం ఆపరేషన్ సిందూర్‌లో సాధించిన విజయాలపై పూర్తి నివేదిక విడుదల చేసింది.
పాక్ యుద్ధవిమానాలను నేలకూల్చినట్టు భారత ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి స్పష్టం చేశారు. అయితే, కూల్చిన విమానాల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు.
''పాక్ విమానాలను మన సరిహద్దుల్లోకి రాకుండా నిరోధించాం. అందువల్ల వాటి శకలాలు మనకు లభించలేదు. అయినా, కొన్ని విమానాలను కచ్చితంగా కూల్చామని ఆయన స్పష్టంచేశారు.