
Sudan: సూడాన్‌లో ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 1000కి పైగా మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్గత యుద్ధాలతో అలమటిస్తున్న ఆఫ్రికా దేశం సూడాన్ మరొక భారీ విపత్తును ఎదుర్కొంది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో జరిగిన కొండచరియల విరిగిపడటంతో కనీసం 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆగస్టు 31న ఈ ప్రమాదం సంభవించినట్లు సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్/ఆర్మీ (SLM/A) వెల్లడించింది. ఈ ఘటనలో ఒక గ్రామం పూర్తిగా నేలమట్టమైందని, ఆ గ్రామంలో ఉన్న ప్రజలలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని వివరించారు.
వివరాలు
సూడాన్ సైన్యం,RSF మధ్య తీవ్రమైన అంతర్యుద్ధం
పశ్చిమ డార్ఫర్‌లోని ఈ గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, మృతుల్లో పురుషులు, మహిళలు, చిన్నారులు ఉన్నారని అబ్దెల్వాహిద్ మహ్మద్ నూర్ నేతృత్వంలోని బృందం తెలిపింది. కొండచరియల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సహాయ సంస్థలు తక్షణమే సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు, ఉత్తర డార్ఫర్‌లో సూడాన్ సైన్యం,పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య తీవ్రమైన అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాంతో ప్రాణాలకు భయపడి ప్రజలు మర్రా పర్వతాల వైపు శరణార్థులుగా వలస వెళ్ళారు. అయితే ఆశ్రయం కోసం వెళ్లిన ఆ ప్రాంతంలోనే ఈ ప్రకృతి విపత్తులో వారు ప్రాణాలు కోల్పోవడం మరింత దురదృష్టకరం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కొండచరియలు విరిగిపడి 1000కి పైగా మృతి
Over 1,000 killed in landslide in western Sudan village !#Sudan #Sudanese #Landslide pic.twitter.com/Px9QdmmMXt
— Shehzad Qureshi (@ShehxadGulHasen) September 2, 2025