
ఫ్రెంచ్ అధికారిణి చేతిలో గొడుగు లాక్కున్న పాక్ ప్రధాని.. షెహబాజ్ షరీఫ్ పై నెటిజన్ల ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులతో ఎలా మెలగాలో నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
షెహబాజ్ షరీఫ్ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం పారిస్ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొడానికి వెళుతున్న సమయంలో వర్షం పడుతోంది.
అయితే అక్కడ విధుల్లో ఉన్న ఓ అధికారిణి గొడుగుతో ప్రధాని రాక కోసం నిరీక్షిస్తున్నారు. షరీఫ్ తడవకుండా కారు దిగిన వెంటనే సదరు ఆఫీసర్ గొడుగు పట్టారు.
ఈ నేపథ్యంలో ప్రధాని సదరు అధికారి చేతిలోని గొడుగుతో లోపలికి వెళ్లిపోయారు.దీంతో ఆమె వర్షంలోనే తడుస్తూ ఆయన్ను అనుసరించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రధాని తీరుపై చురకలు అంటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రధాని తీరుపై నెటిజన్ల చురకలు
Prime Minister Muhammad Shehbaz Sharif arrived at Palais Brogniart to attend the Summit for a New Global Financial Pact in Paris, France. #PMatIntFinanceMoot pic.twitter.com/DyV8kvXXqr
— Prime Minister's Office (@PakPMO) June 22, 2023