
Airspace Ban: భారత్ విమానాలకు పాక్ గగనతల నిషేధం..సెప్టెంబర్ 23 వరకు పొడిగింపు
ఈ వార్తాకథనం ఏంటి
భారత విమానాలపై పాకిస్థాన్ విధించిన గగనతల నిషేధాన్ని ఈసారి మరో నెలపాటు పొడిగించినట్లు పాకిస్థాన్ విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది. జారీ చేసిన నోటీసు ప్రకారం, సెప్టెంబర్ 23 వరకు భారతీయ విమానయాన సంస్థలు నడిపే అన్ని విమానాలు పాక్ గగనతలాన్ని ఉపయోగించలేవు. ఈ నిషేధం భారత యాజమాన్యంలో ఉన్న, లీజులో ఉన్న సైనిక, పౌర విమానాలన్నింటిపై కూడా అమలులో ఉంటుంది అని స్పష్టం చేశారు.
వివరాలు
ఉద్రిక్తతల వేళ
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఏప్రిల్ 23న భారతీయ విమానాలు పాక్ గగనతలలో ప్రవేశించకుండా ఒక నెలపాటు నిషేధం విధించింది. దీనికి ప్రతీకారంగా ఏప్రిల్ 30న పాక్ విమానాలు భారత గగనతలలో ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఆ తర్వాత మే 23 వరకు, తరువాత జూన్ 23 వరకు ఆ నిషేధాన్ని కొనసాగించిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్ ప్రభుత్వం మరోసారి ఈ నిషేధాన్ని ఒక నెలపాటు పొడిగించింది. ఈ నిషేధం ప్రకారం పాక్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానాలు, సైనిక విమానాలు, లీజులో తీసుకున్న విమానాలు కూడా భారత గగనతలంలోకి ప్రవేశించలేవు.
వివరాలు
పాక్‌కు భారీ నష్టం
భారత విమానాలపై గగనతల నిషేధం వల్ల పాక్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. పాక్ రక్షణ మంత్రిత్వశాఖ జారీ చేసిన నివేదిక ప్రకారం, ఎయిర్‌స్పేస్ మూసివేత కారణంగా ఆ దేశానికి దాదాపు 126 కోట్లు రూపాయల నష్టం వాటిల్లింది. అదనంగా, ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు పాక్ గగనతలాన్ని మూసివేయడం వల్ల 4.10 బిలియన్ల పాక్ రూపాయల (భారత కరెన్సీలో సుమారుగా 126 కోట్లు) నష్టం కలిగిందని పాక్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెల్లడించింది.
వివరాలు
పహల్గాం ఉగ్రదాడి ప్రభావం
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు చొరబడి, హిందూ పురుషులపై దాడులు జరిపి 26మంది అమాయకుల ప్రాణాలను తీసుకున్నారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి, పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అంతేకాదు, భారత్ సింధూ జల ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది. దీంతో పాక్, భారత్‌పై దాడులకు పాల్పడింది. అయితే, భారత్ సమర్థవంతంగా తిప్పికోట్టింది. దీనివల్ల పాకిస్థాన్ విధులపరంగా, ఆర్థిక పరంగా భారీ ఇబ్బందులకు గురైంది.