LOADING...
Khawaja Asif: భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వ్యాఖ్యలకు స్పందించిన పాక్ రక్షణ మంత్రి అసిఫ్
భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వ్యాఖ్యలకు స్పందించిన పాక్ రక్షణ మంత్రి అసిఫ్

Khawaja Asif: భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వ్యాఖ్యలకు స్పందించిన పాక్ రక్షణ మంత్రి అసిఫ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్, ఆపరేషన్‌ సిందూర్‌లో భారత వైమానిక దళం తమ ఐదు యుద్ధ విమానాలను కూల్చేసిందనే భారత వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ చేసిన ప్రకటనపై స్పందించింది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్‌ మాట్లాడుతూ, భారత్‌ చేసిన దాడుల్లో తమకు చెందిన ఒక్క యుద్ధ విమానం కూడా దెబ్బతినలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై తాము ఇప్పటికే అంతర్జాతీయ మీడియాకు స్పష్టమైన వివరాలు ఇచ్చామని చెప్పారు. మూడు నెలలుగా ఈ అంశంపై ఎలాంటి వాదనలు లేవని, ఇప్పుడు ఇంత ఆలస్యంగా వచ్చిన ఆరోపణలు నమ్మశక్యం కాదని వ్యాఖ్యానించారు.

వివరాలు 

ప్రపంచం కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం పాక్ చేస్తుందన్న విమర్శలు 

అయితే, భారత్‌ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పటికీ, తమ సైన్యానికి సంబంధించిన ఒక్క విమానం కూడా నష్టపోలేదని చెప్పడం ద్వారా పాకిస్థాన్‌ ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ మాట్లాడుతూ, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలోని ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేశాయని తెలిపారు. పాక్‌ ప్రధాన ఎయిర్‌ ఫీల్డ్‌లలో షహబాజ్‌ జకోబాబాద్‌ స్థావరం సగానికి పైగా దెబ్బతిన్నదని, కనీసం ఐదు యుద్ధ విమానాలు తీవ్ర నష్టం చవిచూశాయని అంచనా వేసినట్లు వెల్లడించారు.

వివరాలు 

80 నుంచి 90 గంటల్లోనే లక్ష్యాలను సాధించాం 

ఆపరేషన్‌ను పూర్తిస్థాయి యాక్షన్‌ ప్లాన్‌తో చేపట్టామని, కేవలం 80 నుంచి 90 గంటల్లోనే లక్ష్యాలను విజయవంతంగా సాధించామని చెప్పారు. యుద్ధం ఇలాగే కొనసాగితే భారీ మూల్యం చెల్లించక తప్పదని పాకిస్థాన్‌ గ్రహించిందని, అందుకే చర్చలకు ముందుకు వచ్చిందని సింగ్‌ వివరించారు.