
India-Pakistan Conflict: కరాచీ,లాహోర్, రావల్పిండి సహా 9 ప్రాంతాల్లో భారత్ డ్రోన్ దాడులు.. పాకిస్తాన్ ఆర్మీ ఆరోపణ..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలో, పాక్ సైన్యం ఒక సంచలన ఆరోపణ చేసింది.
ఈ రోజు ఉదయం లాహోర్‌తో పాటు పాకిస్తాన్‌లోని పలు నగరాల్లో తీవ్రంగా పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయానికి లోనయ్యారు.
"భారత్ మళ్లీ దాడికి దిగుతుందా?" అనే అనుమానాలు ప్రజల్లో వెల్లివిరిశాయి.
ఇదే సమయంలో, పాక్ సైన్యం మీడియా విభాగమైన ఐఎస్‌పీఆర్ (ISPR) శక్తివంతమైన ఆరోపణ చేస్తూ, ఈ పేలుళ్లకు భారతదేశమే బాధ్యమని ప్రకటించింది. అంతేకాకుండా, భారతదేశానికి చెందిన 12 డ్రోన్లను తామే కూల్చేశామని వెల్లడించింది.
వివరాలు
ప్రధాన నగరాలపై డ్రోన్ దాడులు
పాక్ సైన్యం తరఫున ఐఎస్‌పీఆర్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ, కరాచీ, లాహోర్, రావల్పిండి, గుజ్రాన్‌వాలా, అటాక్, బహావల్పూర్ వంటి ప్రధాన నగరాలపై డ్రోన్ దాడులు జరిగాయని తెలిపారు.
ఈ డ్రోన్ దాడుల నేపథ్యంలో, పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (PAA) లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, ఫైసలాబాద్, సియాల్‌కోట్ వంటి కీలక విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పాక్ మీడియా పేర్కొంది.
దీనికి సంబంధించి "నోటీస్ టు ఎయిర్‌మెన్" (NOTAM) ద్వారా అన్ని విమానయాన సంస్థలకు సమాచారం అందించారని తెలియజేశారు.
పాక్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, లాహోర్‌కు రావాల్సిన అన్ని విమానాలను తాత్కాలికంగా కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.
వివరాలు
భద్రతా చర్యల నిమిత్తం అంతర్జాతీయ విమానాశ్రయం ఖాళీ చేయించినట్టు సమాచారం
ఇందులో జెడ్డా, దుబాయ్, మస్కట్, షార్జా, మదీనా వంటి ప్రదేశాల నుంచి రావాల్సిన విమానాలు కూడా ఉన్నాయి.
భద్రతా చర్యల నిమిత్తం లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయం, సియాల్‌కోట్ విమానాశ్రయాలను ఖాళీ చేయించినట్టు సమాచారం.
అదే విధంగా కరాచీ జిన్నా విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక గురువారం ఉదయం,లాహోర్‌లోని వాల్టన్ రోడ్ మరియు పరిసర ప్రాంతాల్లో సడన్‌గా వరుసగా మూడు పేలుళ్లు సంభవించాయి.
ఈ శబ్దాలు బయటికి పరిగెత్తేలా చేశాయి. పేలుళ్లు చాలా తక్కువ వ్యవధిలోనే జరిగాయని, వాటి శబ్దాలు అనేక కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయని లాహోర్ పోలీసులు తెలిపారు.
దీనివల్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాకిస్తాన్ ఆర్మీ ఆరోపణ..
Op Sindoor Phase 2
— Shiv Aroor (@ShivAroor) May 8, 2025
Pakistan Army reports Indian drone strikes in Lahore, Attock, Gujranwala, Chakwal, Rawalpindi, Bahawalpur, Mianwali, Chor, and Karachi. Pak says they’ve been “neutralised”, with one hitting Lahore.
Read that again.
Once more. pic.twitter.com/oXRFZ9Midl