Passport: ప్రపంచంలోని అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్టులు ఇవే.. ఇండియా స్థానం ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఒక వ్యక్తి ఓ దేశం నుంచి మరో దేశం వెళ్లాలంటే కచ్చితంగా పాస్ పోర్టు ఉండాలి. పాస్ పోర్టు లేకుండా ఇతర దేశాలకు వెళ్లడం సాధ్యం కాదు.
ఒకసారి పాస్ పోర్టు పొందాలంటే ఎన్నో నిబంధనలు పాటించాలి.
పోలీస్ వెరిఫికేషన్ నుంచి అన్ని సక్రమంగా ఉంటేనే పాస్ పోర్టును అందిస్తారు.
తాజాగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితాను హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది.
Details
82వ స్థానంలో భారత్
ఈ జాబితా ప్రకారం సింగపూర్ పాస్ పోర్టు అత్యంత శక్తివంతమైందని చెప్పొచ్చు. సింగపూర్ పాస్ పోర్టు ఏకంగా 195 దేశాలను తిరగొచ్చు.
ఇండియా పాస్‌పోర్టుకు 82వ స్థానంలో ఉండగా, ఈ పాస్ పోర్టు ద్వారా 58 దేశాల్లో వీసా లేకుండా ఎంట్రీ ఇవ్వొచ్చు.
రెండో స్థానంలో జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు పాస్‌పోర్ట్‌తో 192 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వొచ్చు.
Details
8వ స్థానానికి పడిపోయిన అమెరికా
మూడవ ర్యాంక్‌లో లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్, ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, ఐర్లాండ్ దేశాలు ఉన్నాయి.
ఈ దేశాల పాస్‌పోర్టుతో 191 దేశాల్లోకి వెళ్లొచ్చు.
తాజా ర్యాంకింగ్స్‌లో అమెరికా 8వ స్థానానికి పడిపోవడం గమనార్హం.
అమెరికా వీసా ఉంటే 186 దేశాలకు వీసా ఫ్రీ ప్రవేశం పొందచ్చు.