Austria: ఆస్ట్రియాలో ప్రధాని నరేంద్ర మోదీకి వందేమాతరంతో ఘన స్వాగతం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం సెంట్రల్ యూరోప్ దేశమైన ఆస్ట్రియా చేరుకున్నారు. రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకుని మోదీ వియన్నా చేరుకున్నారు. ఇక్కడ ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. దీని తర్వాత మోడీని హోటల్ రిట్జ్-కార్ల్టన్‌కు తీసుకువచ్చారు. ఇక్కడ భారత కమ్యూనిటీ సభ్యులు మోదీకి స్వాగతం పలికారు. హోటల్‌లో ఆస్ట్రియా కళాకారులు మోదీ కోసం 'వందేమాతరం' జాతీయ గీతాన్ని వాయించగా, దానిని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
41 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆస్ట్రియాకి భారత ప్రధాని
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆస్ట్రియాలో పర్యటించిన రెండో వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. ఇందిరా గాంధీ 1983లో వియన్నాను సందర్శించారు. 41 ఏళ్ల తర్వాత రెండోసారి ఈ అవకాశం వచ్చింది. ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్, ఆస్ట్రియాలోని భారతీయ కమ్యూనిటీతో చర్చలు సహా ప్రధానమంత్రి మోడీ ఆస్ట్రియాలో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. ప్రధాన మంత్రి, ఛాన్సలర్ ఆస్ట్రియా, భారతదేశానికి చెందిన వ్యాపార ప్రముఖులను కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు.