Taylor Swift: కమలా హారిస్‌కు పాప్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ మద్దతు
అమెరికా అధ్యక్ష ఎన్నికల జాబితాలో డొనాల్డ్ ట్రంప్,కమలాహారిస్ మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు ఇస్తున్నట్లు అమెరికా పాప్ సూపర్‌స్టార్ టేలర్ స్విఫ్ట్ వెల్లడించారు. స్విఫ్ట్, హారిస్‌ను "వారియర్" అని అభివర్ణిస్తూ, తనకు పిల్లలు లేరని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "2024 అధ్యక్ష ఎన్నికల్లో నేను రిపబ్లికన్ అభ్యర్థి కమలాహారిస్,టిమ్ వాజ్‌కు ఓటు వేస్తాను. ఆమె మన హక్కుల కోసం పోరాడుతోంది. మన హక్కుల రక్షణ కోసం వారియర్ అవసరమని నేను నమ్ముతున్నాను. దేశాన్ని శాంతంగా ముందుకు తీసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని ఆమెకు ఉంది. ఈ నిర్ణయాన్ని ఎంతో ఆలోచించి తీసుకున్నాను. మీరూ ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోండి" అని స్విఫ్ట్ రాసుకొచ్చారు.
టేలర్ స్విఫ్ట్ తనకు మద్దతు తెలుపుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు
ఇటీవల, టేలర్ స్విఫ్ట్ తనకు మద్దతు తెలుపుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమె తీవ్రంగా స్పందిస్తూ, అవి ఏఐ ద్వారా తయారుచేసిన ఫొటోస్ అని వెల్లడించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల కలిగే అనర్థాలను అలా ప్రదర్శించినట్లు వ్యాఖ్యానించారు.ఈ ఎన్నికల్లో ఆమె పారదర్శకంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మరోవైపు, ట్రంప్ రన్నింగ్ మేట్ జేడీ వాన్స్,కమలాహారిస్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన పాత వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. అందులో,కమలాహారిస్ పిల్లలు లేని వ్యక్తిగా విమర్శించారు.ఈ విషయం మీద టేలర్ స్విఫ్ట్ స్పందిస్తూ, ఆమె కూడా 'ఛైల్డ్‌లెస్ క్యాట్ లేడీ' అనే లేబుల్‌ను తనపై వేసుకున్న ఫొటోను షేర్ చేశారు.
కమలాహారిస్‌కు మద్దతుగా సెలబ్రిటీలు..
దీని ప్రకారం, స్పేస్-X అధినేత ఎలాన్ మస్క్ స్విఫ్ట్‌పై అభ్యంతరకర పోస్ట్ చేశారు.ఆమె పిల్లల సంరక్షకురాలిగా ఉండాలని తీవ్ర పదజాలంతో విమర్శించారు. 2021లో వాన్స్ చేసిన వ్యాఖ్యల ప్రకారం,"పిల్లలు లేని స్త్రీల జీవితం దయనీయంగా ఉంటుంది,వారు దేశాన్ని కూడా దయనీయంగా మార్చాలని అనుకుంటారు.కమలాహారిస్‌లాంటి వ్యక్తులు డెమోక్రాట్ల భవిష్యత్తును నియంత్రిస్తున్నారు.అందువల్ల దేశాన్ని ఇలాంటి వ్యక్తుల చేతిలో పెట్టడం అనర్థకమే" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అనేక మంది సెలబ్రిటీలు కమలాహారిస్‌ను మద్దతుగా నిలబడి, వాన్స్‌ను విమర్శించారు. స్విఫ్ట్,దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రాజకీయాలపై స్పందించారు. 2018లో,ఆమె టెనస్సీ నుండి డెమోక్రటిక్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. అప్పటినుంచి ఆమె డెమోక్రటిక్ విధానాలను ప్రచారం చేస్తూ, మహిళల హక్కులు,ఆరోగ్యం వంటి అంశాలను సమర్థించారు.ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు.