Page Loader
PM Modi: బ్రూనైతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం: మోదీ 
బ్రూనైతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం: మోదీ

PM Modi: బ్రూనైతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం: మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2024
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనైతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. చారిత్రాత్మక సంబంధాలను కొత్త గమ్యస్థానాలకు తీసుకువెళ్లడమే తన లక్ష్యమని అన్నారు. ఆయన తన రెండు దేశాల పర్యటనలో భాగంగా మంగళవారం బ్రూనై చేరుకున్నారు. యువరాజు హజీ అల్‌ ముహ్‌తడీ బిల్లా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఇది భారత ప్రధాని మొదటి బ్రూనై పర్యటన అని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. "యాక్ట్‌ ఈస్ట్‌ విధానంలో బ్రూనై భారత్‌కు ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. రెండు దేశాల మధ్య స్నేహపూరిత సంబంధాలు ఉన్నాయ" అని పేర్కొంది.

వివరాలు 

ప్రవాసులు.. ఇరు దేశాల వారధులు 

ప్రధాని మోదీ బస చేసిన హోటల్‌ వద్ద ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విద్య, వైద్యం వంటి రంగాలలో వారి కృషిని ప్రశంసిస్తూ, వారు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నారని కొనియాడారు. మోదీ తన చిత్రాన్ని బహుమతిగా ఇచ్చిన ఓ చిన్నారికి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. భారత హైకమిషన్‌ కొత్త కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. బ్రూనైలోని ప్రసిద్ధ ఒమర్‌ అలీ సైఫుద్దీన్‌ మసీదును సందర్శించారు. ఆయన బుధవారం బ్రూనై సుల్తాన్‌తో చర్చలు జరిపి, అనంతరం సింగపూర్‌కు ప్రయాణించనున్నారు.