
Donald Trump: నేటి నుంచి అదనపు సుంకాలు అమల్లోకి.. బిలియన్ డాలర్లు వెనక్కొస్తాయి : ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంతో పాటు అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ట్రంప్ "ట్రూత్ సోషల్"వేదికగా ఒక పోస్టు షేర్ చేశారు. అమెరికా నుంచి లాభాలు పొందిన దేశాల నుండి బిలియన్ల డాలర్లు తిరిగి అమెరికాకు రానున్నాయని ఆయన పేర్కొన్నారు. పరస్పర సుంకాలు ఈరోజు అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని ట్రంప్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా కొన్ని దేశాలు అమెరికా మీద ఆధారపడుతూ లాభాలు పొందుతున్నాయని ఆరోపించారు. కానీ ఇప్పుడు ఆ దేశాల నుంచే అమెరికాకు భారీగా డబ్బు వచ్చే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అమెరికా శ్రేయస్సును అడ్డుకునే ప్రధాన అడ్డంకులు,అతివాద వామపక్ష కోర్టులేనని విమర్శించారు.
వివరాలు
సిరియాపై అత్యధికంగా 41 శాతం సుంకాలు
ఇటీవల ట్రంప్ వివిధ దేశాలపై వివిధ రకాల సుంకాలను విధించారు.''ప్రతీకార సుంకాల్లో మార్పులు'' అనే పేరుతో సుమారు 70 దేశాలపై ఉన్న టారిఫ్‌లను పెంచారు. ఆయన సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం, 10 శాతం నుంచి 41 శాతం వరకు సుంకాలు విధించేలా నిర్ణయం తీసుకున్నారు. వివరాల ప్రకారం,సిరియాపై అత్యధికంగా 41 శాతం సుంకాలను విధించారు. బ్రెజిల్‌పై ఇప్పటికే ఉన్న 10 శాతం టారిఫ్‌కి అదనంగా మరో 40 శాతం కలిపారు. కానీ పాకిస్థాన్‌పై మాత్రం టారిఫ్‌ను 29 శాతం నుండి 19 శాతానికి తగ్గించారు.
వివరాలు
దనపు 25 శాతం సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమలులోకి..
భారత్‌పై మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందని కారణంగా 25 శాతం టారిఫ్ విధించారు. ఇక ఈ టారిఫ్‌ను 50 శాతానికి పెంచుతూ బుధవారం ట్రంప్ మరో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ అదనపు 25 శాతం సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రంప్ చేసిన ట్వీట్
🚨 JUST IN — TRUMP JUST NOW:
— Proud Elephant 🇺🇸🦅 (@ProudElephantUS) August 7, 2025
“BILLIONS OF DOLLARS IN TARIFFS ARE NOW FLOWING INTO THE UNITED STATES OF AMERICA!” pic.twitter.com/SPZz4BUaXb