Pakistan: వచ్చే వారం ట్రంప్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ.. ప్రధాని వెంట వెళ్లనున్న ఆర్మీ చీఫ్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యే అవకాశం ఉందని పాక్ మీడియా పేర్కొంది. ఈ భేటీ, సెప్టెంబర్ 25న, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా జరగనుందని సమాచారం. నివేదికల ప్రకారం, ఈ సమావేశంలో పాకిస్తాన్‌లోని తీవ్రమైన వరద పరిస్థితులు, ఖతార్‌పై ఇజ్రాయిల్ దాడులు వంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది. అంతేకాక, భారత్‌తో ఉన్న దౌత్య ఉద్రిక్తత సమస్యలను కూడా ఈ సమావేశంలో పరిష్కరించే ప్రయత్నం జరుగుతుందని భావిస్తున్నారు. అయితే, పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐసీసీ), వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయానికి దీనిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు.
వివరాలు
పెరుగుతున్న యూఎస్-పాక్ సంబంధాలు:
ఇప్పటికే ఆసిమ్ మునీర్ రెండు సార్లు అమెరికాలో పర్యటించారు. దీని తర్వాత, పాక్ ప్రధాని భేటీపై వార్తలు వచ్చాయి. అమెరికాకు ప్రత్యర్థిగా పరిగణిస్తున్న చైనాతో ఇన్నాళ్లు అంటకాగిన పాకిస్తాన్, ఇప్పుడు అమెరికాతో సంబంధాల పెరుగుదల కోసం ప్రయత్నిస్తోంది. గతంలో, రెండు దేశాల మధ్య సంబంధాలు పరిమిత స్థాయిలో మాత్రమే ఉన్నాయి. జూన్‌లో, ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో వైట్ హౌజ్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలపై చర్చ జరిగిందని సమాచారం.
వివరాలు
పెరుగుతున్న యూఎస్-పాక్ సంబంధాలు:
ఈ భేటీ తర్వాత, జూలైలో పాకిస్తాన్‌లోని ''చమురు నిల్వలను'' అభివృద్ధి చేయడానికి అమెరికా సహకరించే అవకాశం ఉందని ప్రకటించింది. అలాగే, ఇటీవల, ఖనిజ రంగంలో పాకిస్తాన్ అమెరికా నుంచి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పొందగలిగింది.