Page Loader
చైనాలో ఘోరం.. ప్రమాదవశాత్తు 68వ అంతస్తుడి నుంచి జారిపడి ప్రాణాలు విడిచిన ఫ్రాన్స్ సాహసికుడు 
ప్రమాదవశాత్తు 68వ అంతస్తుడి నుంచి జారిపడి ప్రాణాలు విడిచిన ఫ్రాన్స్ సాహసికుడు

చైనాలో ఘోరం.. ప్రమాదవశాత్తు 68వ అంతస్తుడి నుంచి జారిపడి ప్రాణాలు విడిచిన ఫ్రాన్స్ సాహసికుడు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 31, 2023
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా దేశంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. అనుమతి లేకుండా ఓ ఆకాశహర్మ్యంలోని టాప్ ఫ్లోర్ కు చేరుకున్న ఓ సాహసికుడి యాత్ర దుస్సాహసంగా మారింది. ప్రమాదవశాత్తు అక్కడ్నుంచి కిందపడి చనిపోయిన ఘటన హంకాంగ్‌లో జరిగింది. అత్యంత ఎత్తైన భవనాలను అవలీలగా అధిరోహించగల సామర్థ్యం రెమీ లుసిడి సొంతం. 30 ఏళ్ల ఫ్రాన్స్‌ సాహసికుడు తాజాగా డ్రాగన్ దేశంలో సాహసానికి ప్రయత్నించాడు. హాంకాంగ్‌ లోని ది ట్రెగంటెర్‌ టవర్‌ కాంప్లెక్స్‌ భవనాన్ని అధిరోహించేందుకు యత్నించిన లుసిడి, భవనంలోని 68వ ఫ్లోర్‌లోని పెంట్‌ హౌస్‌ కిటికి వెలుపల భాగంలో చిక్కుకున్నాడు. దీంతో భయపడ్డ లుసిడి, కిటికీని బలంగా కాలుతో తన్నడంతో అతడి కాలు పట్టు తప్పింది. ఈ క్రమంలో అమాంతం కిందకు జారిపడిపోయి ప్రాణాలు వదిలాడు.

DETAILS

స్నేహితుడు ఉన్నాడని చెప్పి లోపలకి ప్రవేశించిన లుసిడి

సోమవారం ఉదయం 6 గంటల సమయంలో లుసిడి తొలుత సెక్యూరిటీ క్యాబిన్ వద్దకు వచ్చాడు. 40వ అంతస్తులో తన స్నేహితుడు ఉన్నాడని చెప్పి లోపలకి ప్రవేశించాడు. మరోవైపు 40వ అంతస్తులోని సదరు వ్యక్తి లుసిడి ఎవరో తెలియదని సెక్యూరిటీకి బదులిచ్చాడు. అప్పటికే తప్పుడు సమాచారం ఇచ్చిన లుసిడి లిఫ్టులోపై ఫ్లోర్ కి వెళ్తున్నాడు. 49వ ఫ్లోర్‌ నుంచి మెట్ల మార్గంలోపైకి వెళ్లినట్లు ఇరుగుపొరుగు చెబుతున్నారు. భవనంపైకప్పుపైనా మాత్రం లుసిడి కనిపించలేదని పేర్కొన్నారు. ఉదయం 7.38 సమయంలో అతడ్ని చూసి నిర్ఘాంతపోయిన పెంట్‌హౌస్‌లోని పనిమనిషి పోలీసులకు సమాచారం అందింది. అంతకుముందే అతడు పట్టుతప్పి కిందకి జారిపోయాడు. ఘటనా స్థలంలో లుసిడి కెమెరాను హాంగ్ కాంగ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.