తదుపరి వార్తా కథనం

Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. 90 రోజుల పాటు టారిఫ్‌కు బ్రేక్.. చైనాకు మాత్రం 125శాతం పెంపు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 09, 2025
11:53 pm
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయంతో వార్తల్లోకి ఎక్కారు. చైనాను మినహాయించి మిగతా 70 దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా అమలు నుంచి ఉపసంహరించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇక చైనాపై టారీఫ్‌ను భారీగా పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న సుంకాలను 125 శాతానికి పెంచనున్నట్లు తెలిపారు.
చైనా ప్రపంచ మార్కెట్లను అవమానంగా చూసిందని, అంతర్జాతీయ వ్యాపార నిబంధనలను గౌరవించకపోవడమే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమని ట్రంప్ పేర్కొన్నారు.
ఇక చైనా ఇప్పటికే అమెరికా వస్తువులపై 84 శాతం టారీఫ్ విధించిన సంగతి తెలిసిందే.