NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Kamala Harris: కమలా హారిస్  తల్లి పుట్టిన ఊరిలో పండగ వాతావరణం .. ఎక్కడంటే..? 
    తదుపరి వార్తా కథనం
    Kamala Harris: కమలా హారిస్  తల్లి పుట్టిన ఊరిలో పండగ వాతావరణం .. ఎక్కడంటే..? 
    కమలా హారిస్ తల్లి పుట్టిన ఊరిలో పండగ వాతావరణం .. ఎక్కడంటే..?

    Kamala Harris: కమలా హారిస్  తల్లి పుట్టిన ఊరిలో పండగ వాతావరణం .. ఎక్కడంటే..? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 24, 2024
    01:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నారు.

    బైడెన్ తన స్థానంలో భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను అధ్యక్ష అభ్యర్థిగా సిఫార్సు చేశారు.

    ఈ నిర్ణయంతో అమెరికాలోని కమలా హారిస్ మద్దతుదారుల్లో సంతోషం వెల్లివిరుస్తుండగా.. భారత్‌లోని కుగ్రామమైన తులసేంద్రపురంలో మాత్రం సంబరాల వాతావరణం నెలకొంది.

    ఎందుకంటే , ఇది కమలా హారిస్ పూర్వీకుల గ్రామం కాబట్టి. తమిళనాడులోని చిన్న గ్రామమైన తులసేంద్రపురంలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం.

    వివరాలు 

    తులసేంద్రపురంలో ఆనంద వాతావరణం నెలకొంది 

    అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల నుండి వైదొలిగిన తర్వాత, కమలా హారిస్ ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మారారు.

    వాషింగ్టన్ డీసీకి దాదాపు 14,000 కిలోమీటర్ల దూరంలోని తులసేంద్రపురం గ్రామానికి ఈ వార్త తెలియగానే ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది.

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ విజయం సాధించాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. అంతే కాదు కమలా హారిస్ విజయోత్సవాన్ని జరుపుకునేందుకు ఈ గ్రామంలో సన్నాహాలు మొదలయ్యాయి.

    వివరాలు 

    తులసేంద్రపురం ప్రజలు కమలా హారిస్‌ను చూసి గర్వపడుతున్నారు 

    కమలా హారిస్‌ విజయం పట్ల గర్వంగా భావిస్తున్నామని తులసేంద్రపురం ప్రజలు అంటున్నారు.

    కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా మారడంతో గ్రామంలో కూడా సంబరాలు మిన్నంటాయి.

    కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామ ప్రజలు పలుచోట్ల టపాకాయలు పేల్చి టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ ఊరి ప్రజలకు కమలా హారిస్ అంటే చాలా ఇష్టం.

    వివరాలు 

    కమల ఐదేళ్ల వయసులో గ్రామానికి వచ్చిందా? 

    కమలా హారిస్‌కు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు, ఆమె తన తాతయ్యతో కలిసి ఇక్కడికి వచ్చిందని గ్రామ ప్రజలు అంటున్నారు.

    గ్రామ ప్రజలు ఇప్పటికీ ఆమెను 'మా ఊరి బిడ్డ' అని పిలుస్తుంటారు. కమలా హారిస్‌కు గ్రామంలోని ప్రజలు ప్రత్యేక పూజలు కూడా చేశారు.

    కమలా హారిస్ అధ్యక్షురాలైతే ఇక్కడ వేడుకలు మరింత ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులు అంటున్నారు.

    వివరాలు 

    గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు  

    అయితే ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కమలా హారిస్ ఇక్కడికి రాకపోవడంతో గ్రామ ప్రజలు ఒకింత నిరుత్సాహానికి గురవుతున్నారు.

    ఆమె ఒక్కసారైనా గ్రామాన్ని సందర్శిస్తారని లేదా తమ గురించి ప్రస్తావిస్తారని గ్రామస్థులు ఎదురు చూస్తున్నారని గ్రామ దుకాణదారు ఒకరు తెలిపారు.

    అయినప్పటికీ, ప్రజలు ఆమె విజయానికి గర్వపడుతున్నారు. ఆమె రాష్ట్రపతి కావాలని ప్రార్థిస్తున్నారు.

    వివరాలు 

    గ్రామంలోని వీధుల్లో కమలా హారిస్ పోస్టర్లు అంటించారు 

    కమలా హారిస్ విజయంతో తులసేంద్రపురం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. గ్రామంలోని వీధుల్లో కమలా హారిస్ పోస్టర్లు అంటించారు.

    ఆమె ఫోటోలతో కూడిన క్యాలెండర్లు కూడా వేయించారు. కమలా హారిస్ (అమెరికా అధ్యక్ష ఎన్నికలు) అధ్యక్షురాలైతే, గ్రామంలో సంబరాల వాతావరణం మరింత ఎక్కువగా ఉంటుంది.

    గ్రామస్తులు ఈసారి మరిన్ని బాణాసంచా కాల్చి ప్రత్యేక పూజలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కమలా హారిస్ విజయం కోసం ఊరి ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు

    వివరాలు 

    కమలా హారిస్‌పై గ్రామ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు 

    కమలా హారిస్ అధ్యక్షురాలైతే గ్రామ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని గ్రామ ప్రజలు భావిస్తున్నారు.

    చాలా మంది తమ ఇంటి గోడలపై కమలా హారిస్ చిత్రాన్నిఅతికించారు. గ్రామంలో కమలా హారిస్ చిత్రపటానికి కూడా పూజలు చేసేవారు కొందరున్నారు.

    కమలా హారిస్ అధ్యక్షురాలైతే ఆమె తమ గ్రామాన్ని తప్పకుండా సందర్శిస్తారని ప్రజలు భావిస్తున్నారు. ఈ గ్రామ ప్రజలను కలవడానికి కమలా హారిస్ తప్పకుండా వస్తారని వారు భావిస్తున్నారు.

    వివరాలు 

    గ్రామ ప్రజలు కమలా హారిస్‌ను పూజిస్తారు 

    డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ను గెలిపిస్తే ఈ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని తులసేంద్రపురం ప్రజలు అంటున్నారు.

    గ్రామంలోని ఒక గుడిలో కమలా హారిస్ కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా జరుగుతాయి. కమలా హారిస్ పేరు మీద ఒక శాసనం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కమలా హారిస్ కథను గ్రామంలోని ప్రతి చిన్నారికి చెబుతారు.

    గ్రామానికి చెందిన కమిటీ సభ్యుడు కలియపెరుమాళ్ కమలా హారిస్ అధ్యక్షురాలైతే భారత ప్రపంచకప్ విజయం కంటే సంబరాలు పెద్దగా జరుగుతాయని అన్నారు.

    అమెరికా అధ్యక్ష ఎన్నికల పరిస్థితిని ఆ గ్రామ ప్రజలు నిత్యం టీవీలు,వార్తాపత్రికల ద్వారా గమనిస్తూనే ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కమలా హారిస్‌

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    కమలా హారిస్‌

    Kamala Harris: కొత్త  సర్వేల్లో ముందంజలో కమలా హ్యారీస్.. వెనుకబడ్డ ట్రంప్  డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025