Page Loader
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే? 
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే?

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే? 

వ్రాసిన వారు Stalin
Jul 11, 2023
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ దేశాలు రక్షణ రంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. సైనిక శక్తి స్థాయిని బట్టే ఇతర దేశాల్లో ఆ దేశానికి ప్రాధాన్యత దక్కుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ రక్షణ సమాచారాన్ని ట్రాక్ చేసే వెబ్‌‌సైట్ 'గ్లోబల్ ఫైర్‌ పవర్(జీఎఫ్‌పీ)' 2023 ఏడాదికి సంబంధించి మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. ఫైర్‌ పవర్‌ను కొలిచే 60సూచికల ఆధారంగా 145దేశాలకు జీఎఫ్‌పీ రేటింగ్ ఇచ్చింది. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, రష్యా, చైనా తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

సైనిక శక్తి

నాలుగో స్థానంలో భారత్

గ్లోబల్ ఫైర్‌ పవర్ బాబితాలో భారతదేశం తన నాలుగో స్థానాన్ని నిలుపుకుంది. యూకే 5వ, దక్షిణ కొరియా 6వ, పాకిస్థాన్ 7వ, జపాన్ 8వ, ఫ్రాన్స్ 9వ, ఇటలీ 10వ స్థానాన్ని దక్కించుకున్నాయి. దేశం మొత్తం ఫైర్‌ పవర్ కొలతను పవర్ ఇండెక్స్ అంటారు. పవర్‌ ఇండెక్స్ అనేది విలోమానుపాతంలో ఉంటుంది. అంటే పవర్‌ ఇండెక్స్ విలువ ఎంత తక్కువగా ఉంటే, ఆ దేశ సైనిక శక్తిమంతంగా ఉంటుందని జీఎఫ్‌టీ పేర్కొంది. పవర్ ఇండెక్స్ విలువలో 0.0712తో అమెరికా మొదటిస్థానంలో ఉంది. రష్యా 0.0714, చైనా 0.0722, భారత్ 0.1025, యూకే 0.1435, దక్షిణ కొరియా, 0.1505, పాకిస్థాన్ 0.1694 తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

సైనిక శక్తి

ఉక్రెయిన్‌కు 15, ఆస్ట్రేలియాకు 16స్థానాలు

ఒకప్పుడు గొప్ప సైనిక శక్తిగా ఉన్న టర్కీ జాబితాలో 11వ స్థానంలో ఉంది. బ్రెజిల్ 12, ఇండోనేషియా 13, ఈజిప్ట్ 14 స్థానాల్లో నిలిచాయి. పవర్‌ ఇండెక్స్‌లో 0.2516 విలువతో ఉక్రెయిన్ 15వ ర్యాంక్‌లో ఉండగా, ఆస్ట్రేలియా 16వ స్థానంలో ఉంది. భూటాన్, బెనిన్, మోల్డోవా, సోమాలియా, లైబీరియా, సురినామ్, బెలిజ్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఐస్లాండ్, సియర్రా, లియోన్ దేశాలు జాబితాలో కింద నుంచి టాప్ 10 దేశాలుగా నిలిచాయి.