LOADING...
Donald Trump: బంగారంపై సుంకాలు లేవు.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్!
బంగారంపై సుంకాలు లేవు.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్!

Donald Trump: బంగారంపై సుంకాలు లేవు.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 12, 2025
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశం దిగుమతి చేసుకునే పలు దేశాల వస్తువులపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగుమతి బంగారు కడ్డీలపై కూడా సుంకాలు పెరుగుతాయా? అన్న ప్రశ్నపై సందిగ్ధత నెలకొంది. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ, బంగారంపై సుంకాలు విధించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గతవారం అమెరికా కస్టమ్స్‌ విభాగం విడుదల చేసిన ప్రకటనలో, ఒక కిలో బంగారు కడ్డీలు, అలాగే 100 ఔన్సుల (సుమారు 2.8 కిలోల) బంగారు బార్లు సుంకాల పరిధిలోకి వస్తాయని పేర్కొంది.

Details

పసిడి ధర రికార్డు స్థాయికి

అదే సమయంలో బంగారంపై సుంకాల అమలుపై ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేయవచ్చన్న వైట్‌హౌస్‌ అధికారి వ్యాఖ్యలు మార్కెట్‌ వర్గాల్లో మరింత గందరగోళానికి దారితీశాయి. ఈ అస్పష్టత మధ్య పసిడి ధర రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకుంది. అయితే ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో బంగారంపై సుంకాలు ఉండవని ప్రకటించగానే ధర ఒక్క ఔన్సుపై 50 డాలర్ల మేర పడిపోయింది. మరోవైపు స్విట్జర్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై 39 శాతం సుంకం విధించాలని ట్రంప్‌ ఇటీవల నిర్ణయించారు. అయినప్పటికీ, స్విస్‌ సహా అనేక దేశాల నుంచి వచ్చే బంగారు ఉత్పత్తులు ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేనట్టుగా తెలుస్తోంది.