Page Loader
US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, కమలా హారిస్‌లకు కలిసి వచ్చే అంశాలివే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, కమలా హారిస్‌లకు కలిసి వచ్చే అంశాలివే..!

US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, కమలా హారిస్‌లకు కలిసి వచ్చే అంశాలివే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2024
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election 2024) కీలక దశకు చేరుకున్నాయి. కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. జో బైడెన్‌ వెనక్కి తగ్గిన తరువాత, డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హారిస్‌ (Kamala Harris) రంగంలోకి దిగారు. ఆమె అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించేందుకు ప్రయత్నిస్తుండగా, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

వివరాలు 

ట్రంప్‌ వ్యూహాలు: అక్రమ వలసలు, ఆర్థిక వ్యవస్థ 

ట్రంప్‌ తన ప్రచారంలో అక్రమ వలసలు, ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టారు. అమెరికా ఓటర్లు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు, ''నాలుగేళ్ల క్రితం కంటే ఇప్పుడు మీరు మెరుగ్గా ఉన్నారా?'' అంటూ ట్రంప్‌ ప్రశ్నిస్తున్నారు. క్యాపిటల్‌ అల్లర్లు, నేరారోపణలు, ఇతర కేసుల కారణంగా విమర్శలు ఎదురైనా, ట్రంప్‌కి మద్దతు నిలకడగానే ఉంది.

వివరాలు 

హారిస్‌ వ్యూహాలు: అబార్షన్ హక్కులు, విద్యాధికుల మద్దతు 

ఇదే సమయంలో, హారిస్‌ అబార్షన్ హక్కులను తన ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. అమెరికాలో మహిళల హక్కులను పరిరక్షించాలనే విషయంపై ఆమె ప్రచారం చేస్తున్నారు. సుప్రీం కోర్టు అబార్షన్ హక్కులను రద్దు చేసిన తరువాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నందున, హారిస్‌కు మహిళా ఓటర్ల మద్దతు ఎక్కువగా లభిస్తోంది. ఫైనాన్సియల్ ప్రయోజనాలు ఇక ఎన్నికల ఖర్చు విషయానికొస్తే, హారిస్‌ సొమ్ము సేకరణలో ముందంజలో ఉన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, 2023 నుంచి ట్రంప్ కంటే ఎక్కువ నిధులు ఆమె కూడగట్టారు. ఈ విధంగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగుతుండగా, ఆఖరి దశలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.