Suchir Balaji Death: 'ఇది ఆత్మహత్యలా అనిపించడం లేదు'.. సుచిర్ బాలాజీ మరణంపై మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
చాట్‌జీపీటీ మాతృసంస్థ 'ఓపెన్‌ఏఐ' సమాజానికి హాని కలిగిస్తోందని గతంలో విమర్శలు చేసిన ప్రజా వేగు (విజిల్ బ్లోయర్) సుచిర్ బాలాజీ (26) ఆకస్మిక మరణం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది.
అతని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సంఘటన ఆత్మహత్యగా అనిపించడంలేదని మస్క్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
కుమారుడి మృతిపై అనుమానాలు
సుచిర్ బాలాజీ నవంబర్ 26న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్‌మెంట్‌లో మరణించి ఉన్నాడు.
ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు దీనిని ఆత్మహత్యగా నిర్ధారించారు.
కానీ, తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలాజీ తల్లి పూర్ణిమారావ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
ఆమె ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ను నియమించి మరల శవపరీక్ష చేయించినట్లు తెలిపారు.
ఆ పరీక్ష ఫలితాలు పోలీసుల నివేదికకు భిన్నంగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
ఈ విషయంపై మస్క్ స్పందిస్తూ, ఇది ఆత్మహత్యగా అనిపించడంలేదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.