Page Loader
TikTok: అమెరికాలో టిక్‌టాక్‌ సేవలు తాత్కాలికంగా నిలిపివేత
అమెరికాలో టిక్‌టాక్‌ సేవలు తాత్కాలికంగా నిలిపివేత

TikTok: అమెరికాలో టిక్‌టాక్‌ సేవలు తాత్కాలికంగా నిలిపివేత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2025
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌ టాక్ తమ సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ నేరుగా యూజర్లకు తెలియజేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు సందేశాలు పంపుతూ, తమ సేవలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించేందుకు తీసుకొచ్చిన చట్టం జనవరి 19 నుంచి అమల్లోకి రానుంది. అందుకే ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నామని టిక్‌టాక్ తన యూజర్లకు సందేశం పంపింది. 2017లో ప్రారంభమైన టిక్‌టాక్‌ను భారత్ సహా అనేక దేశాలు నిషేధించాయి. అలాగే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కూడా దీని వినియోగంపై ఆంక్షలు పెట్టాయి.

Details

అమెరికా ప్రతినిధుల సభ బిల్లుకు ఆమోదం

ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీనిలో చైనా యాజమాన్యాన్ని వదలకపోతే టిక్‌టాక్‌కు నిషేధం ఎదురవుతుందని పేర్కొంది. అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు డెడ్‌లైన్‌ను ఇచ్చింది. జనవరి 19లోగా యూఎస్ టిక్‌టాక్‌ను విక్రయిస్తారా లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారా అనే నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించింది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ 2024 జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బీజింగ్‌పై కఠిన ఆంక్షలు విధించాలని ఇప్పటికే ప్రకటించారు.