English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Canada: కెనడాతో విభేదాలు మరింత పెంచేందుకు అమెరికా యత్నాలు.. ఫైవ్ ఐస్ కూటమి నుండి సాగనంపేందుకు సన్నాహాలు  
    తదుపరి వార్తా కథనం
    Canada: కెనడాతో విభేదాలు మరింత పెంచేందుకు అమెరికా యత్నాలు.. ఫైవ్ ఐస్ కూటమి నుండి సాగనంపేందుకు సన్నాహాలు  
    కెనడాతో విభేదాలు మరింత పెంచేందుకు అమెరికా యత్నాలు..

    Canada: కెనడాతో విభేదాలు మరింత పెంచేందుకు అమెరికా యత్నాలు.. ఫైవ్ ఐస్ కూటమి నుండి సాగనంపేందుకు సన్నాహాలు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 26, 2025
    11:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా, కెనడా మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతున్నట్లు తెలుస్తోంది.

    అమెరికా తన ప్రధాన మిత్రదేశాలతో ఏర్పాటుచేసిన ఇంటెలిజెన్స్‌ కూటమి 'ఫైవ్‌ ఐస్‌' నుంచి కెనడాను తొలగించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.

    అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత సమీప సలహాదారుల్లో ఒకరైన పీటర్‌ నవర్రో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఈ అంశంపై చర్చలు జరుగుతున్నట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్ పత్రిక వెల్లడించింది.

    ఒట్టావాపై మరింత ఒత్తిడి పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

    వివరాలు 

    బ్రిటన్‌లో పెరుగుతున్న వలస ముస్లింల జనాభా

    ఈ ప్రతిపాదనకు ట్రంప్‌ మద్దతు కూడా ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా, ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చిన వేళ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ బ్రిటన్‌పై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

    బ్రిటన్‌లో పెరుగుతున్న వలస ముస్లింల జనాభాను ప్రస్తావిస్తూ, అది అణ్వాయుధాలతో కూడిన అసలైన దేశంగా మారుతోందని వ్యాఖ్యానించారు.

    ట్రంప్‌ ప్రధాన లక్ష్యమైన మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్ సిద్ధాంతాన్ని పూర్తి చేయాలంటే, ఇంగ్లిష్‌ మాట్లాడే మిత్రదేశాలను కూడా అమెరికా దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.

    అయితే, ఫైనాన్షియల్‌ టైమ్స్ రిపోర్టును పీటర్‌ నవర్రో "నిరర్థకం" అంటూ కొట్టిపారేశారు.

    మీరు
    25%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    కెనడాపై ఒత్తిడి పెంచుతున్న అమెరికా 

    ట్రంప్‌ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచే, కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా విలీనం చేయాలన్న చర్చలు జరుగుతున్నాయి.

    ఆయన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోను "గవర్నర్‌" అని సంబోధించిన సందర్భాలు ఉన్నాయి.

    తాజాగా, కెనడాపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో అమెరికా 25% దిగుమతి సుంకాలను విధించేందుకు సిద్ధమైంది. ఈ సుంకాలు మార్చి నుంచి అమలులోకి రానున్నాయి.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    100 ఏళ్లకుపైగా బలమైన అనుబంధం 

    రెండో ప్రపంచ యుద్ధంలో ఇంటెలిజెన్స్‌ భాగస్వామ్యం ఎంతో కీలకమని గుర్తించిన అమెరికా, యుకే కలిసి 1946లో విశ్వసనీయ సమాచార మార్పిడి కోసం UKUSA ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

    ఆ తర్వాత, ఈ కూటమిని రెండు మార్లు విస్తరించి, 1956 నాటికి కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ను కూడా ఇందులో చేర్చారు.

    అప్పటి నుంచి ఇది 'ఫైవ్‌ ఐస్‌ ఇంటెలిజెన్స్‌ అలయన్స్‌'గా మారింది.

    ఈ కూటమిలోని దేశాల నిఘా సంస్థలు పరస్పరం కీలక సమాచారం షేర్‌ చేసుకోవడంతో పాటు, అనధికారిక ఒప్పందాల ప్రకారం సహకరించుకుంటాయి.

    మానవ మేధా నిఘా, భద్రతా సమాచార మార్పిడి, సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌, భౌగోళిక, అంతరిక్ష నిఘా సమాచారం, రక్షణ రంగ నిఘా వంటి అంశాల్లో దేశాల మధ్య సహకారం కొనసాగుతోంది.

    మీరు
    75%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    అవాస్తవ లీకులను మీడియాలో విడుదల చేసిన కెనడా

    సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా మొబైల్ నెట్‌వర్క్‌, ఇంటర్నెట్‌, రాడార్‌, ఆయుధ వ్యవస్థల కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ నుంచి వెలువడే ఎలక్ట్రానిక్‌ సంకేతాలను సేకరించి, వాటిని పరస్పరం పంచుకుంటాయి.

    అంతేకాకుండా, ఉపగ్రహ చిత్రాల ఆధారంగా డేటాను షేర్‌ చేసుకోవడం ఈ దేశాల నిఘా విధానంలో భాగమైంది.

    ఈ ఐదు దేశాలన్నీ ప్రధానంగా ఆంగ్ల భాష మాట్లాడే దేశాలే కావడం గమనార్హం.

    భారతదేశంతో ఖలిస్థానీ వివాదం సందర్భంలో, కెనడా ఈ కూటమిని అడ్డం పెట్టుకొని కొన్ని అవాస్తవ లీకులను మీడియాలో విడుదల చేసినట్లు సమాచారం.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    కెనడా

    తాజా

    PSL 2025: రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ! పాకిస్థాన్
    ott platforms: పాకిస్థాన్‌ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం  కేంద్ర ప్రభుత్వం
    Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ సాంస్కృతిక కార్యక్రమాలు  బీసీసీఐ
    Rajnath Singh: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్  రాజ్‌నాథ్ సింగ్

    అమెరికా

    Indian Migrants: సైనిక విమానంలో 104 మంది వలసదారుల తరలింపు.. అమెరికా ఎంత ఖర్చు చేసిందంటే? డొనాల్డ్ ట్రంప్
    Nvidia: జపాన్‌లో ఎన్విడియా చిప్స్‌ కోసం పోటీ పడ్డ చైనీయులు.. RTX 50 సిరీస్‌కు పెరిగిన డిమాండ్ చైనా
    Canada: అమెరికా ఐరన్‌ డోమ్‌ ప్రాజెక్టులో మేమూ భాగస్వాములవుతాం.. ప్రకటించిన కెనడా రక్షణ మంత్రి కెనడా
    US Deportation: అక్రమంగా ప్రవేశించిన 487 మంది భారతీయులకు అమెరికా షాక్! ప్రపంచం

    కెనడా

    India-Canada: అగ్ర దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్,కెనడా..ఇరుదేశాల మధ్య క్షిణిస్తున్న సంబంధాలు..ఈ వివాదంలో ఏమి జరుగబోతోంది  భారతదేశం
    India-Canada: దిగజారుతున్న భారత్-కెనడా దౌత్య సంబంధాలు.. వ్యాపార సంబంధాలను దెబ్బతీస్తాయా? భారతదేశం
    India-Canada Row: కెనడా ఆరోపణలకు అమెరికా మద్దతు.. "సహకరించాలని" భారత్‌కి అభ్యర్థన అమెరికా
    India-Canada: కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలకు భారత్‌ గట్టి కౌంటర్‌  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025