World Round 2023: ఈ ఏడాది విపత్తులు మిగిల్చిన విషాదాలు. భీకర యుద్ధాలివే!
సరికొత్త ఆశలు, లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు యావత్ ప్రపంచం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గడిచిన 2023 కాలాన్ని ఓసారి గుర్తు చేసుకుంటే కొన్ని విపత్తులు పలు దేశాలను వణికించాయి. మరోవైపు భీకర యుద్ధాల కారణంగా ఎంతో మంది మృత్యువాత పడ్డారు. వీటితో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు, భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు చీలిపోవడం వంటి పరిమాణాలకు 2023 సాక్ష్యంగా నిలిచింది. టైటాన్ సబ్ మైరైన్ అట్లాంటిక్ మహాసముద్రంలో సూమారు 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి మినీ జలాంతర్గామి గల్లంతైంది. నీటి ఒత్తిడికి టైటాన్ పేలిపోవడంతో ఆరుగురు ప్రాణాలు విడిచారు.
తుర్కియేలో భూకంపం కారణంగా 67 వేల మంది మృతి
జనాబాలో చైనాను దాటిన ఇండియా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా అవతరించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న చైనాను 2023లో భారత్ అధిగమించింది. తుర్కియే విషాదం ఫిబ్రవరి 6న తుర్కియే, సిరియాలో చోటు చేసుకున్న భూకంపం కారణంగా 67వేల మంది మరణించారు. 7.8, 7.7 తీవ్రత కారణంగా లక్షలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. లక్షలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు ఇమ్రాన్ ఖాన్ అరెస్టులో పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఏడాది పాటు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
గాజాలో నిరాశ్రయులైన 23 లక్షల మంది
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై మెరుపుదాడి చేయడంతో పశ్చిమాసియాలో భీకర యుద్ధానికి దారి తీసింది. హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా, గాజాలో ఇప్పటివరకూ 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా గాజాలో 23 లక్షల మంది గాజా పౌరులు నిరాశ్రయులయ్యారు.
ఉక్రెయిన్ లో 10వేల మంది పౌరులు మృతి
భారత్-కెనడా సంబంధాలు కెనడాలో ఖలిస్తానీ మద్దతురాలు దుశ్చర్యల కారణంగా ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమయ్యాడు. అతడి మరణానికి భారత్ కారణమని కెనడా ఆరోపించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. రష్యా యుద్ధం ఇక ఉక్రెయిన్, రష్యా మొదలుపెట్టిన యుద్ధం రెండో ఏడాది కూడా కొనసాగింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఇప్పటివరకూ 10వేల మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఉక్రెయిన్, రష్యాలకు చెందిన ఐదు లక్షల మంది సౌనికులు మరణించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.