Page Loader
Donald Trump : కమలా హారిస్‌తో ముఖాముఖి చర్చకు ఓకే చెప్పిన ట్రంప్.. డేట్ ఎప్పుడంటే
కమలా హారిస్‌తో ముఖాముఖి చర్చకు ఓకే చెప్పిన ట్రంప్.. డేట్ ఎప్పుడంటే

Donald Trump : కమలా హారిస్‌తో ముఖాముఖి చర్చకు ఓకే చెప్పిన ట్రంప్.. డేట్ ఎప్పుడంటే

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2024
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ తరుఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది. ఈ మేరకు ఆమెతో డిబేట్ జరిపేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించాడు. ఇక వచ్చే నెలలో వీరిద్దరి మధ్య డిబేట్ జరిగే అవకాశం ఉంది.

Details

గతంలో ట్రంప్, జో బైడన్ మధ్య డిబేట్

సెప్టెంబర్ 4న వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ నిర్వహించాలని ఫాక్స్ న్యూస్ చేసిన ప్రతిపాదనకు తాను అంగీకరించారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. జూన్ 27న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడన్ మధ్య డిబైట్ జరిగింది. ఈ ముఖాముఖిలో ఇరువురు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఈ డిబైట్ లో ట్రంప్ దే పైచేయి కనిపించడంతో సొంత పార్టీ నుంచే బైడన్ పై విమర్శలొచ్చాయి. ఆ తర్వాత తాను అధ్యక్ష రేసు నుంచి తప్పకుంటున్నట్లు బైడన్ ప్రకటించారు.

Details

కమలా హారిస్ తో డిబేట్ కు సిద్ధం

ఈ క్రమంలో డెమోక్రాట్ల అభ్యర్థిగా ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు కమలా హారిస్‌ బరిలో నిలిచింది. దీంతో ట్రంప్‌తో డిబేట్ కు తాను సిద్ధమని ఆమె ప్రకటించింది. కానీ అప్పట్లో ట్రంప్ మాత్రం అంగీకరించలేదు. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా నిర్ణయించే వరకు వెయిట్ చేస్తానని ట్రంప్ చెప్పారు. అయితే నిన్న కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక కావడంతో డిబేట్ కు తాను సిద్ధం ట్రంప్ వెల్లడించారు.