
Donald Trump: జిన్‌పింగ్,పుతిన్,కిమ్ అమెరికాపై కుట్రలు: ట్రంప్ ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తరకొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ముగ్గురు నాయకులు అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ సమయంలో, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అమెరికా సాధించిన విజయం 80వ వర్ధంతి సందర్భంగా బీజింగ్‌లో (చైనా)వైభవంగా ఆయుధ ప్రదర్శన జరగడం గమనార్హం. బుధవారం ట్రూత్ సోషల్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చైనా కోసం పోరాడిన అమెరికన్ సైనికుల త్యాగాలను గుర్తించాలి. చైనా ఆ సమయంలో విజయం కోసం యుద్ధం చేయగా,చాలామంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.
వివరాలు
అత్యాధునిక హై-ప్రొఫైల్ ఆయుధాలను ప్రదర్శించిన చైనా
ఈ త్యాగాలు,ధైర్యం జిన్‌పింగ్ గుర్తిస్తారా లేదా అన్నది పెద్ద ప్రశ్న అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తన వ్యాఖ్యలలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు, చైనా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, సైనికుల త్యాగాలను గౌరవిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. అదే సమయంలో, కిమ్ జోంగ్ ఉన్, వ్లాదిమిర్ పుతిన్‌లకు అభినందనలు చెప్పడమే కాక, వీరు యూఎస్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. తియానన్మేన్ స్క్వేర్‌లో జరిగే చైనా ఆయుధ ప్రదర్శనలో పుతిన్, కిమ్ తదితరుల సహా సుమారు 26 దేశాల అగ్రనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజింగ్ తన చరిత్రలో తొలిసారిగా అత్యాధునిక హై-ప్రొఫైల్ ఆయుధాలను ప్రదర్శించింది.