Trump: యూఎస్‌ఎయిడ్ సంస్థలో 9700 మందిపై వేటుకు ట్రంప్ సిద్ధం.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పైనా ఆంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఇప్పటికే ఇతర దేశాలపై టారిఫ్‌లు, ఆంక్షలతో కఠినంగా వ్యవహరిస్తున్న ఆయన, ఇప్పుడు స్వదేశంలోనూ కొన్ని సంస్థల్లో పెద్దఎత్తున మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థగా గుర్తింపు పొందిన 'అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ' (USAID)లో 9,700కి పైగా ఉద్యోగాలను తొలగించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.
ఈ సంఖ్యను 300కు తగ్గించాలనే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ ప్రణాళిక ప్రకారం, కేవలం 294 మంది ఉద్యోగులే USAIDలో కొనసాగనున్నారు.
వివరాలు
ఐసీసీపైనా ఆంక్షలు
వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరోలో, మరో ఎనిమిది మంది ఆసియా బ్యూరోలో పని చేయనున్నారు.
మిగిలిన 9,700 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
ఇంకా, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై (ICC) కూడా ట్రంప్ ఆంక్షలు విధించారు.
ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తాజాగా ఆయన సంతకం చేశారు.
అమెరికా, దాని మిత్రదేశం ఇజ్రాయెల్‌పై అనవసర దర్యాప్తులు చేపడుతున్నదని ట్రంప్ విమర్శించారు.
ముఖ్యంగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తన అధికారాలను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు.