
Trump tariffs: భారత్‌పై ట్రంప్ సుంకాలు.. 'ఆగష్టు 27'తరువాత పొడిగింపు ఉండకపోవచ్చు : పీటర్ నరావో
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించారని సమాచారం. ఆగస్టు 27 నుంచి ఈ కొత్త సుంకాలు 50 శాతం రేటుతో అమల్లోకి రానున్నాయని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ సుంకాల గడువు పొడిగింపు విషయానికి వస్తే అలాంటి అవకాశమే కనిపించడం లేదని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో వెల్లడించారు. గతంలోనే ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం రాబోయే వారం నుంచే కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని ఆయన గుర్తుచేశారు. భారత్‌ను సుంకాల విషయంలో 'మహారాజ్'గా అభివర్ణించిన నరావో, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఆర్థికంగా లాభదాయకమైన విధానాన్ని భారత్ కొనసాగిస్తోందని ఆరోపించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'డెడ్‌లైన్' పొడిగింపు ఉండకపోవచ్చు : పీటర్ నరావో
#NewsFatafat | White House Trade Advisor Peter Navarro accuses India of "refinery profiteering," calling it a "laundromat" for Russian oil. Warns Trump unlikely to extend Aug 27 tariff deadline#USIndia #RussiaOil #Geopolitics #Trade pic.twitter.com/24rXQkQp7C
— ET NOW (@ETNOWlive) August 22, 2025