Page Loader
NASA Chief: నాసా తదుపరి చీఫ్‌గా జేర్డ్ ఐజాక్‌మెన్‌ను ఎంపిక.. ప్రకటించిన ట్రంప్‌ 
నాసా తదుపరి చీఫ్‌గా జేర్డ్ ఐజాక్‌మెన్‌ను ఎంపిక.. ప్రకటించిన ట్రంప్‌

NASA Chief: నాసా తదుపరి చీఫ్‌గా జేర్డ్ ఐజాక్‌మెన్‌ను ఎంపిక.. ప్రకటించిన ట్రంప్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2024
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పాలకవర్గంలో నియామకాల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తాజాగా, అగ్రరాజ్య అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) తదుపరి చీఫ్‌గా బిలియనీర్, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మెన్ (Jared Isaacman)ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. స్పేస్‌-X (SpaceX) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)తో వ్యాపార భాగస్వామ్యాన్ని కలిగిన ఐజాక్‌మెన్ ఎంపిక చాలా చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

స్పేస్‌వాక్ చేసిన తొలి ప్రైవేట్ వ్యోమగామి

'షిఫ్ట్4 పేమెంట్స్' (Shift4 Payments) కంపెనీ సీఈవోగా ఉన్న 41 ఏళ్ల ఐజాక్‌మెన్, స్పేస్‌ఎక్స్ సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాలతో పెద్దగా సంబంధాలు లేకున్నా, రెండు సార్లు అంతరిక్షంలో ప్రయాణించిన అనుభవం ఆయనకు ఉంది. అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేసిన తొలి ప్రైవేట్ వ్యోమగామిగా (Private Astronaut) ఆయన గుర్తింపు పొందారు.